మారటోరియానికి ఓకే! 

మారటోరియానికి ఓకే! 

ప్రభుత్వానికి చెప్పిన వొడాఫోన్ ఐడియా
న్యూఢిల్లీ: టెలికం రిలీఫ్ ప్యాకేజి కింద  ఆఫర్ చేసిన స్పెక్ట్రమ్‌‌‌‌ పేమెంట్స్‌‌‌‌ మారటోరియాన్ని వొడాఫోన్ ఐడియా (వీ) అంగీకరించింది. నాలుగేళ్ల పాటు స్పెక్ట్రమ్ పేమెంట్స్ కట్టాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం రిలీఫ్ ప్యాకేజిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఆఫర్‌‌‌‌‌‌‌‌ను అంగీకరించిన మొదటి టెలికం కంపెనీగా వీ నిలిచింది. స్పెక్ట్రమ్‌‌‌‌ పేమెంట్స్‌‌‌‌కు సంబంధించిన బ్యాంక్ గ్యారెంటీలను  ఎప్పుడు తిరిగి అప్పజెప్పుతారనే అంశాన్ని కూడా డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ఆఫ్ టెలికమ్యూనికేషన్‌‌‌‌ (డాట్‌‌‌‌) ను వీ ఎంక్వైరీ చేసింది.  అడ్జెస్టడ్ గ్రాస్‌‌‌‌ రెవెన్యూ (ఏజీఆర్‌‌‌‌‌‌‌‌)  పేమెంట్స్‌‌‌‌పై మారటోరియం తీసుకోవడం, వీటిపై పడే వడ్డీలను కంపెనీ ఈక్విటీ కింద కన్వర్ట్ చేసుకోవడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని డాట్‌‌‌‌కు తెలిపింది. ఏజీఆర్ పేమెంట్స్‌‌‌‌పై మారటోరియం నిర్ణయాన్ని ఈ నెల 29 లోపు తీసుకోవాలి. వీ షేర్లు బుధవారం సెషన్‌‌‌‌లో 7 శాతం పెరిగి రూ. 10.70 వద్ద క్లోజయ్యాయి. ప్రభుత్వం కిందటి నెలలో టెలికం రిలీఫ్​ ప్యాకేజిని ప్రకటించింది. ఏజీఆర్ బకాయిలు, స్పెక్ట్రమ్‌‌‌‌ పేమెంట్లపై నాలుగేళ్ల పాటు మారటోరియం తీసుకోవడం, బ్యాంక్‌‌‌‌ గ్యారెంటీలను తగ్గించడం, బకాయిలపై వడ్డీని కంపెనీలో ఈక్విటీగా మార్చుకోవడం వంటి అంశాలు ఈ రిలీఫ్‌‌‌‌ ప్యాకేజీలో ఉన్నాయి. మారటోరియం పూర్తయ్యాక బకాయిలను కూడా ఈక్విటీగా మార్చుకునే అవకాశం ఉంటుంది. 
వీ కస్టమర్లు తగ్గారు..
కిందటి నెలలో 8.3 లక్షల మంది కస్టమర్లను వీ కోల్పోయింది. ఇదే టైమ్‌‌‌‌లో రిలయన్స్ జియో 6.5 లక్షల మంది కస్టమర్లను, ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌ 1.3 లక్షల మంది కస్టమర్లను యాడ్ చేసుకున్నాయి.  44.38 కోట్ల మంది కస్టమర్లతో జియో నెంబర్ వన్ పొజిషన్‌‌‌‌లో కొనసాగుతుండగా, 35.41 కోట్ల మంది కస్టమర్లతో ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌ రెండో పొజిషన్‌‌‌‌లో ఉంది.  వీ కస్టమర్లు 27.1 కోట్లకు తగ్గారు. జియో రూరల్ ఏరియాల్లో కూడా కస్టమర్లను భారీగా పెంచుకుంది. ట్రాయ్ డేటా ప్రకారం, జియోకి టెలికం సెక్టార్‌‌‌‌‌‌‌‌లో 37.40 % మార్కెట్‌‌‌‌ షేరు ఉంది. ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌కు 29.85 % , వీ కి 22.84 % మార్కెట్ షేరు ఉంది.