వనపర్తి, వెలుగు: వివాదాల పరిష్కారానికి లోక్ అదాలత్ ఓ అవకాశమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత సూచించారు. బుధవారం జిల్లా కోర్టు హాల్ లో న్యాయవాదులు, బ్యాంక్, ఇన్సూరెన్స్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 21న నిర్వహించనున్న లోక్ అదాలత్ ను వినియోగించుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ లో సివిల్, వివాహ సంబంధిత కేసులు, మోటార్ ప్రమాద క్లెయిమ్ లు, చెక్ బౌన్స్ కేసుల్లో రాజీ కుదుర్చుకోవాలన్నారు.
లోక్ అదాలత్ లో రాజీ కుదుర్చుకోవడంతో డబ్బు, సమయం ఆదా అవుతుందని, అప్పీల్ కు వెళ్లే అవకాశం ఉండదని చెప్పారు. డీఎల్ఎస్ఏ సెక్రటరీ వి.రజని, న్యాయమూర్తులు జి.కళార్చన, కె.కవిత, కార్తీక్ రెడ్డి, నోముల అశ్విని, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.కిరణ్ కుమార్ పాల్గొన్నారు.

