వర్ధన్నపేట/ పర్వతగిరి/ రాయపర్తి, వెలుగు: కొనుగోలు కేంద్రాల నిర్వహణ సక్రమంగా ఉండాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద నిర్వాహకులకు సూచించారు. శుక్రవారం ఆమె వర్ధన్నపేట పట్టణంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలన్ని ప్రారంభించి, ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించారు. పర్వతగిరి మండలం రావూరు, అన్నారం, రాయపర్తి మండలం రాయపర్తి, పెర్కవేడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పరిశీలించి, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
