వరంగల్ జిల్లాలో పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన డీసీపీ

వరంగల్ జిల్లాలో పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన డీసీపీ

నల్లబెల్లి, వెలుగు: వరంగల్​ జిల్లా నల్లబెల్లి, దుగ్గొండి పోలీస్​స్టేషన్లను సోమవారం వరంగల్​డీసీపీ అంకిత్​ కుమార్​ తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరు, కేసుల నమోదు, నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల వివరాలను తెలుసుకున్నారు. స్టేషన్​లోని లాకప్​, ఆయుధాలు, రికార్డుల గదులను పరిశీలించారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సూచించారు.

 కొన్నేళ్ల నుంచి స్టేషన్లలో పెండింగ్​ ఉన్న వాహనాల వివరాలు తెలుసుకొని  కేసులు లేనివాటిని అప్పగించాలని ఆదేశించారు.