వరంగంల్ ఎంజీఎం హాస్పిటల్ వరుస ఘటనలపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో ఇద్దరు పేషెంట్లకు ఒకే సిలిండర్ వాడటం వంటి చర్యలపై ఆగ్రహించిన ప్రభుత్వం.. ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. కిషోర్ పై వేటు వేసింది. ఎంజీఎం పరిస్థితులపై ఆరా తీసిన వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.. నివేదిక సమర్పించాలని అధికారులు ఆదేశించారు.
ప్రతివారం ఎంజీఎం పై సమీక్ష నిర్వహించి సమగ్ర నివేదిక సమర్పించాలని డీఎంఈ కి ఆదేశాలు జారీ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డాక్టర్లు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆస్పత్రిని గాడిన పెట్టేందుకు తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని హెల్త్ సెక్రెటరీని ఆదేశించింది. ఇప్పటికైనా నూతన సూపరింటెండెంట్ ఏర్పాటుతో ఎంజీఎంలో సరైన వైద్యసదుపాయాలు అందాలని రోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.
