
- 21 రోజుల కింద తండ్రి.. ఇప్పుడు కొడుకు మృతితో తీవ్ర విషాదం
మియాపూర్, వెలుగు: స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి వాటర్ ట్యాంకర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడమంచి గ్రామానికి చెందిన బి.అశోక్(42) తన భార్య, ఇద్దరు కూతుళ్లు, కొడుకుతో కలిసి హైదరాబాద్‌లోని ఫిరోజ్‌గూడలో ఉంటున్నారు. ఓ కార్గో కంపెనీలో జాబ్ చేస్తున్న అశోక్.. బుధవారం ఉదయం డ్యూటీ మీద స్కూటీపై ముత్తంగి వెళ్లాడు. అనంతరం తిరిగి వెళ్తుండగా.. చందానగర్ నుంచి మియాపూర్ వైపు వెళ్తున్న అశోక్‌ను మదీనగూడ జీఎస్ఎం మాల్‌వద్ద వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చి వాటర్ ట్యాంకర్ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో అశోక్అక్కడికక్కడే మృతి చెందగా, డెడ్‌బాడీని మియాపూర్ పోలీసులు గాంధీ మార్చురీకి తరలించారు. ప్రమాదం అనంతరం వాటర్ ట్యాంకర్‌ను అక్కడే వదిలేసి డ్రైవర్పరారీ కాగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 9న అశోక్ తండ్రి పోచయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. పెద్ద దిక్కును కోల్పోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆ కుటుంబానికి అశోక్ మరణం మరింత శోకాన్ని మిగిల్చింది.