నీటి వృథా నాజిల్​తో ఆపేయొచ్చు

నీటి వృథా నాజిల్​తో ఆపేయొచ్చు

నీళ్లు పొదుపుగా వాడాలి.. ఈ మాట ఎప్పుడూ వినేదే. కానీ, ఎంత జాగ్రత్త చేసినా  కొన్నిసార్లు  అవసరానికి మించి నీళ్లు వాడి, వేస్ట్​ చేయాల్సి వస్తుంది.  అదెలా అంటారా! హ్యాండ్​ వాష్​కి ఒక గ్లాస్​ లేదా అరగ్లాస్​ నీళ్లు సరిపోతాయి.  కానీ అదే హ్యాండ్​ వాష్​కోసం ట్యాప్​ తిప్పితే  అరలీటరు నీళ్లు ఖర్చు అవుతాయి. ట్యాప్​ ఫ్లో తక్కువ పెట్టినా నీటి వృథా కంట్రోల్​ కొంచెమే అవుతుంది. నీటి సమస్యలు రోజురోజుకి పెరగడానికి ఇది కూడా ఒక కారణం. ఈ సమస్యకి పరిష్కారంగా మార్కెట్​లోకి కొత్తరకం నాజిల్స్ వచ్చాయి​. నీటి వృథాని తగ్గించడానికి చెన్నైకి చెందిన ​‘ఎర్త్​ ఫోకస్​’ అనే స్టార్టప్​ ​కంపెనీ వీటిని తయారుచేసింది.ప్యాండ​మిక్​ వల్ల నష్టపోయిన స్టార్టప్స్​లో ఎర్త్​ ఫోకస్​ కూడా ఒకటి. అయినా వాళ్లు చేసే ఎక్స్​పరిమెంట్స్​ను ఆపలేదు ఈ స్టార్టప్​ సీఈవో అరుణ్​ సుబ్రమణియన్. నీటి వృథాని కంట్రోల్​ చేయడానికి  లాక్​డౌన్​లో ‘ఎకో–మిస్ట్​ అంబరిల్లా, క్వా మిస్ట్360’ అనే రెండు నాజిల్స్​​ తయారుచేశాడు. అయితే ఇవేమీ కొత్త కాదు.  లాక్​డౌన్​కి ముందే వీటిని మార్కెట్​లోకి తెచ్చారు. లాభాలు కూడా బాగానే వచ్చాయి. కాకపోతే, లాక్​డౌన్​లో బిజినెస్​ తగ్గడంతో వాటినే అప్​డేట్​ చేసి కొత్త వెర్షన్​తో మార్కెట్​లోకి తీసుకొచ్చారు. వీటిని వాడితే హ్యాండ్​ వాష్​, సామాన్లు, కూరగాయలు కడగడానికి ఉపయోగించే నీళ్లలో 95 శాతం వృథాను తగ్గిస్తాయి. కిచెన్​, వాష్​రూం ట్యాప్​లకి  వీటిని పెట్టేయొచ్చు. ఈ సంవత్సరం జనవరిలో రిలీజ్​ అయిన ఎకో మిస్ట్​ అంబరిల్లా నాజిల్స్​ ఇప్పటి వరకు 8వేలు అమ్ముడుపోయాయి. క్వా మిస్ట్360 కి  కూడా మంచి ఆదరణ వచ్చింది. ​వీటి రేటు కూడా  ఆరువందలలోపే. ఈ నాజిల్స్​ని మల్టీనేషనల్​ కంపెనీలు వాడుతున్నాయి. కొన్ని ఎయిర్​పోర్ట్స్​లో కూడా ఇవి ఉన్నాయి. రానున్న రోజుల్లో ప్రతి ఇంటికి వీటిని పరిచయం చేసే ఆలోచనలో ఉందట ఈ స్టార్టప్​. అదే జరిగితే నీటి వృథాని కొంతలో కొంతైనా కంట్రోల్​ చేయొచ్చు.