అక్రమాలకు పాల్పడిన ప్రతి మంత్రి, MLA,MPల భరతం పడ్తామ్

అక్రమాలకు పాల్పడిన ప్రతి మంత్రి, MLA,MPల భరతం పడ్తామ్
  • కోర్టుకు వెళ్తాం..  సీబీఐకీ వెళతాం..ఎక్కడివరకైనా పోరాడ్తం
  • టీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోకుండా.. అధికారులపై ఏసీబీ రైడ్స్ ఎందుకు చేస్తున్నారు?
  • అవినీతి చేస్తే కొడుకునైనా వదిలిపెట్టనని చెప్పి మంత్రి మల్లారెడ్డిని ఎందుకు వదిలేశారు ? 
  • మల్లారెడ్డి భాగోతం పై ఆధారాలతో పోరాటం చేస్తాం
  • ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్

హైదరాబాద్: ‘‘అక్రమాలకు పాల్పడిన ప్రతి మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీల భరతం పడ్తామ్.. కోర్టుకు వెళ్తాం..  సీబీఐకీ వెళతాం..ఎక్కడివరకైనా పోరాడతామ్.. టీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోకుండా.. అధికారులపై ఏసీబీ రైడ్స్ ఎందుకు చేస్తున్నారు..?.. అవినీతి చేస్తే కొడుకునైనా వదిలిపెట్టనని చెప్పి మంత్రి మల్లారెడ్డిని ఎందుకు వదిలేశారు ? 
మల్లారెడ్డి భాగోతం పై ఆధారాలతో పోరాటం చేస్తాం..’’ అని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రకటించారు. ఆదివారం గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. 
మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు కబ్జా కోరులుగా మారారు
మంత్రులే కాదు టీఆర్ఎస్ నాయకులు కూడా కబ్జాకోరులుగా మారారని, కోట్ల రూపాయలవిలువ చేస్తే భూములను మింగేస్తుండ్రు అని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. మంత్రి మల్లారెడ్డిపై రేవంత్ రెడ్డి ఆధారాలతో ఆరోపణలు చేస్తే.. మల్లారెడ్డి ఆరోపణలను ఎదుర్కోడానికి తొడలు, జబ్బలు కొట్టుకుంటూ మాట్లాడిండు, నేను అమాయకుణ్ణి అని అంటుండు, సిగ్గుచేటు అని విమర్శించారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఎందుకు మౌనంగా వుంటున్నారని ఆయన ప్రశ్నించారు. మౌనమేలా.. కేసీఆర్..,  మల్లారెడ్డితో ఏమైనా కుమ్మక్కయ్యారా అని ఆయన నిలదీశారు. అవినీతికి పాల్పడితే కొడుకునైన విడిచిపెట్టా.. అన్నారు. మరి మల్లారెడ్డిని ఎందుకు వదులుతున్నారు. అక్రమాలకు పాల్పడిన ప్రతి మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ ల భరతం పడ్తామ్, కోర్టుకు వెళ్తా, సిబిఐ కి వెళతాం అని దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. 
కేసీఆర్ అవినీతిని మంత్రులు బయటపెడతారని భయపడుతున్నారా? 
టీఆరెస్ ప్రజా ప్రతినిధులపై చర్యలు తీసుకోకుండా.. అధికారులపై ఏసీబీ రైడ్స్ ఎందుకు చేస్తున్నారు..? తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తుందా.. ? లేక  కేసీఆర్ అవినీతిని మంత్రులు బయట పెడతారేమోనని భయపడుతున్నారా.. ? అని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.  లేదంటే మల్లారెడ్డి అవినీతిలో కేసీఆర్ కు వాటా ఉందా..? అని ఆయన నిలదీశారు. తెలంగాణ ప్రజలు ఈ అవినీతి మంత్రుల భరతం పట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఆధారాలతో మల్లారెడ్డి భాగోతం పై పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అటు బండి సంజయ్ పై కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడిండ్రు, ఇటు రేవంత్ పై కూడా ఇష్టం వచ్చినట్లు దుషిస్తున్నారని ఆయన విమర్శించారు. ‘‘గుండ్లపోచంపల్లిలో.. 650 సర్వే నెంబర్ లో 16ఎకరాలు శ్రీనివాస్ రెడ్డి ఎట్లా ఎక్కింది? ఆ భూమిని మల్లారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డి పేరు పై రిజిస్ట్రేషన్ చేశారు. 1965 -66లో  పహాణి 22.8 ఎకరాలు వుంది.. అదేవిధంగా 2020 లో వరకు వుంది. ధరణి కొచ్చేసరికి 33.26 ఎకరాలు ఉన్నట్లు చూపించారు. 
శామీర్ పేట్ లో సీఎంఆర్ (CMR) హాస్పిటల్ పేరుతో ప్రజల రక్తం తాగుతుండ్రు. ప్రభుత్వ భూమిలో మల్లారెడ్డి హాస్పిటల్ ఎట్లా వస్తది.రిజిస్ట్రేషన్ శాఖ కూడా సర్కార్ భూమి అని రిపోర్ట్ ఇచ్చింది. తప్పుడు డాకుమెంట్స్ పెట్టి bhel భూములు నావే నాని నమ్మించే ప్రయత్నం చేసిండు మల్లారెడ్డి.. మల్లారెడ్డి ఏమైన కేసీఆర్ అల్లుడా.. లేక తెలంగాణ అల్లుడా..’’ అంటూ దాసోజు శ్రవణ్ విరుచుకుపడ్డారు. 
న్యాక్ కమిటీ బ్లాక్ లిస్టులో పెడితే కేసీఆర్ యూనివర్సిటీకి అనుమతి ఇచ్చిండు
న్యాక్ కమిటీ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీని బ్లాక్ లిస్ట్ లో పెడితే.. కేసీఆర్ ఏకంగా యూనివర్సిటీకి అనుమతి ఇచ్చిండు అని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. గుండ్ల పోచంపల్లిలోని హెచ్ఎండీఏ ( hmda) లేఔట్ లో వున్న పార్క్ నుండి మల్లారెడ్డి హాస్పిటల్ కు రోడ్డు వేసుకుండు, తెలంగాణ కోసం 1200 మంది బలిదానాలు మల్లారెడ్డి కోసమా..? అని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీ లో ఆరుగురు మంత్రులపై ఆరోపణలు వస్తే.. అప్పటి ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని, కేంద్రమంత్రులను కూడా వదల్లేదని ఆయన గుర్తు చేశారు. 
24గంటల కరెంటులో విచ్చల విడిగా అవినీతి
24గంటల కరెంటు ఇస్తున్నామని చెబుతున్నా అందులో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. మియాపూర్ భూములు.. ఇసుక మాఫియా.. నయీం డబ్బులు.. ఆస్తులు..  ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో దోపిడీ.. కేసీఆర్ కిట్లు, మందుల కొనుగోళ్లలో దందా.. ఇలా ఎక్కడ చూసినా అవినీతే కనిపిస్తోందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రుల అవినీతిపై ఎక్కడి వరకైనా పోరాటం చేస్తామని దాసోజు శ్రవణ్ హెచ్చరించారు.