
US-బేస్డ్ టెక్ దిగ్గజం మెటా (Meta) అధికారికంగా టెక్స్ట్ అప్‌డేట్‌లను షేర్ చేయడానికి, పబ్లిక్ కన్వర్జేషన్స్ ను మరింత డెవలప్ చేసేందుకు ఓ కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ థ్రెడ్స్ ను విడుదల చేసింది. థ్రెడ్స్‌ను వాస్తవానికి జూలై 6న సాయంత్రం ప్రారంభించాలని నిర్ణయించారు. కానీ కంపెనీ దీన్ని ముందుగానే విడుదల చేయాలని నిర్ణయించుకుంది.
“థ్రెడ్స్ అనేది టెక్స్ట్ అప్‌డేట్‌లను షేర్ చేయడం, పబ్లిక్ కన్వర్జేషన్స్ కోసం ఇన్‌స్టాగ్రామ్ టీమ్ రూపొందించిన కొత్త యాప్. దీన్ని మీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఉపయోగించి లాగిన్ చేయవచ్చు. ఇందులో పోస్ట్‌లు 500 అక్షరాల వరకు ఉంటాయి. అంతే కాదు దీని ద్వారా 5 నిమిషాల నిడివిలో లింక్‌లు, ఫొటోలు, వీడియోలను కలిగి ఉంటాయి" అని మెటా ఒక బ్లాగ్‌పోస్ట్‌లో తెలిపింది.
Also Read :- మీ ఫోన్ స్పీడ్ గా వర్క్ చేయాలంటే ఇలా చేయండి
థ్రెడ్స్ ను డౌన్‌లోడ్ చేసి సైన్ అప్ చేయడం ఎలా
మీరు థ్రెడ్‌లను ఉపయోగించాలనుకుంటే, చేయాల్సిందల్లా యాప్ స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
థ్రెడ్స్ ను ఎలా ఉపయోగించాలి
- డౌన్‌లోడ్ చేసిన తర్వాత, యాప్‌ని తెరిచి, "ఇన్‌స్టాగ్రామ్‌తో లాగిన్"పై క్లిక్ చేయండి.
- మీరు ఇప్పటికే మీ ఫోన్ లో Instagram యాప్‌ని ఇన్‌స్టాల్ చేసి ఉంటే, థ్రెడ్స్ మిమ్మల్ని ఆటోమేటిక్‌గా లాగిన్ చేస్తాయి.
- మీరు ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఇన్‌స్టాల్ చేయకుంటే, దాన్ని ఇన్‌స్టాల్ చేయమని అడుగుతుంది. దయచేసి గమనించండి.
- మీరు యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, థ్రెడ్స్ ను లాగిన్ చేయగలుగుతారు.
- లాగిన్ అయిన తర్వాత, మీరు మీ సన్నిహిత స్నేహితులకు మెసేజ్ లను పంపడం ప్రారంభించవచ్చు.ట
సంస్థ ప్రకారం, ఇన్‌స్టాగ్రామ్ మాదిరిగానే, థ్రెడ్స్ లో యూజర్స్ తమ అభిరుచులను పంచుకునే స్నేహితులు, క్రియేటర్‌లను ఫాలో చేయవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో వారు అనుసరించే వ్యక్తులతోనూ కనెక్ట్ అవ్వవచ్చు.
- అలాగే, 16 ఏళ్లలోపు (లేదా నిర్దిష్ట దేశాల్లో 18 ఏళ్లలోపు) యూజర్స్ యాప్‌లో చేరినప్పుడు ప్రైవేట్ ప్రొఫైల్‌లోకి డిఫాల్ట్ గా యాడ్ అవుతారు.
- థ్రెడ్స్ యూజర్స్ చాట్ చేసే లేదా రిప్లైలు కూడా ఇవ్వవచ్చు.
పైన కనిపించే త్రీ-డాట్ మెనుని నొక్కడం ద్వారా థ్రెడ్స్ పై ప్రొఫైల్‌ను అన్‌ఫాలో చేయవచ్చు. బ్లాక్ చేయవచ్చు, లిమిట్ చేయవచ్చు లేదా నివేదించవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ చేసిన ఖాతాలు ఆటోమేటిక్ గా థ్రెడ్స్ లోనూ బ్లాక్ చేయబడతాయి.