వాట్సాప్ యాక్టివ్‌లో లేకున్నా మైక్రోఫోన్‌ ఆన్ లోనే ఉంటుందా.. మస్క్ ఎలా రిప్లై ఇచ్చాడంటే

వాట్సాప్ యాక్టివ్‌లో లేకున్నా మైక్రోఫోన్‌ ఆన్ లోనే ఉంటుందా.. మస్క్ ఎలా రిప్లై ఇచ్చాడంటే

యాప్ యాక్టివ్‌గా లేనప్పటికీ వాట్సాప్ లోని మైక్రోఫోన్‌ యాక్సెస్ లోనే ఉంటుందని ఓ ఇంజినీర్ ట్విట్టర్ వేదికగా చేసిన ఆరోపణలు ప్రస్తుతం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ విషయంపై తాజాగా ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. "నథింగ్ ట్రస్ట్.. నాట్ ఈవెన్ నథింగ్" అంటూ ఆయన ట్విట్ చేశారు.

వాట్సాప్ యూజ్ చేయకపోయినా.. బ్యాక్‌గ్రౌండ్‌లో మైక్రోఫోన్‌ యాక్సెక్ లోనే ఉంటుందని ఓ ఇంజినీర్ పేర్కొన్నారు. తాను నిద్రపోతున్నప్పుడు వాట్సాప్ లో మైక్రోఫోన్ ఆన్ అవుతుందని, మార్నించ్ లేచి చూసే సరికి మైక్రోఫోన్ ఆన్ అయ్యి ఉండడం గమనించానని ఆ వ్యక్తి ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై ఎలాన్ మస్క్ రిప్లై ఇస్తూ.. దేన్నీ నమ్మొద్దని, ఏం కాదని ఆయన ట్విట్టర్ లో రాసుకొచ్చారు.

వాట్సాప్ లో ఇలా తెలియకుండానే మైక్రోఫోన్ యాక్సెస్ అవ్వడంపై స్పందించిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్.. ఈ చర్యను ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు ప్రకారం గోప్యత ఉల్లంఘనపై చర్య తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ ఆరోపణలను వాట్సాప్ తోసిపుచ్చింది. మైక్ సెట్టింగ్స్ పై యూజర్స్ కు పూర్తి కంట్రోల్ ఉంటుందని తెలిపింది. ఒకసారి పర్మిషన్ ఇస్తే.... వాట్సాప్ యూజర్స్ కాల్ చేస్తున్నప్పుడు లేదా వాయిస్ నోట్ లేదా వీడియోను రికార్డ్ చేస్తున్నప్పుడు మాత్రమే మైక్‌ను యాక్సెస్ చేస్తుందని స్పష్టం చేసింది. ఆ తర్వాత ఎలాంటి కమ్యూనికేషన్‌లైనా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా రక్షించబడతాయని.. కాబట్టి వాట్సాప్ వాటిని వినదని జోడించింది. అయితే ఈ తరహా సమస్యలను చాలా మంది యూజర్స్ ఎదుర్కొంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

https://twitter.com/elonmusk/status/1655974471101042690