మే నెల అగిపోయినట్లు అనిపిస్తుందా..? గ్రహాల 'స్లో మోషన్' వెనక జ్యోతిష్య రహస్యాలివే!

 మే నెల అగిపోయినట్లు అనిపిస్తుందా..? గ్రహాల 'స్లో మోషన్' వెనక జ్యోతిష్య రహస్యాలివే!

మే 2026లో చాలా మందికి జీవితం ఒకే చోట ఆగిపోయినట్లు, మానసికంగా భారంగా అనిపిస్తుందా.... అనుకున్న పనులు వాయిదా పడుతున్నాయా, ఉత్సాహం తగ్గడం వంటివి జరుగుతుందా..... ఇది కేవలం మీ భావన మాత్రమే కాదు, గ్రహాల గమనం వల్ల కలిగే మార్పు అని జ్యోతిష్యం చెబుతోంది. ఈ నెలలో మనం పరుగు తీయడం కంటే, ఆగి ఆలోచించడానికే ప్రాధాన్యత ఇవ్వాలి.

ఈ మే నెలలో పరిస్థితులు ఇలా మందగించడానికి ముఖ్య కారణం శని దేవుడు. శని గ్రహం క్రమశిక్షణ, బాధ్యత, ఆలస్యానికి ప్రతీక. ఈ ప్రభావం వల్ల  జీవితం గంభీరంగా మారుతుంది. కొత్త పనులు మొదలుపెట్టడం కంటే, పాత బాధ్యతలను పూర్తి చేయడంపైనే దృష్టి ఉంటుంది. మీరు వెళ్తున్న దారి సరైనదేనా.. అని శని మనల్ని ప్రశ్నించుకోమంటాడు. వేగం కంటే నాణ్యత ముఖ్యం అని ఈ కాలం మనకు నేర్పుతుంది.

 బుధ గ్రహ ప్రభావం
తెలివితేటలకు, ప్రయాణాలకు, మాటలకు అధిపతి అయిన బుధుడు ఈ సమయంలో కొంత బలహీనంగా ఉండవచ్చు. ఇతరులతో మాట్లాడేటప్పుడు అపార్థాలు రావచ్చు. ఫోన్లు, ఇంటర్నెట్ వంటి సాంకేతిక విషయాల్లో సమస్యలు తలెత్తవచ్చు. ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ప్రయాణాల్లో కూడా చిన్న చిన్న ఆటంకాలు ఎదురుకావచ్చు.

 చంద్రుని ప్రభావం 
మన మనస్సుపై చంద్రుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మే 2026లో చంద్రుని స్థితి వల్ల మనసు అదుపులో ఉండకపోవచ్చు. చిన్న విషయానికే అలసిపోవడం, ఏకాంతంగా ఉండాలని అనిపించడం లేదా పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి బాధపడటం వంటివి జరుగుతాయి. ఇది ఒక రకమైన 'మెంటల్ క్లీనింగ్' లాంటిది. మనసులోని భారాన్ని వదిలించుకోవడానికి ఈ సమయం ఉపయోగపడుతుంది.

మనం ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలని ఉరుకులు పరుగులు పెడుతుంటాం. కానీ ఈ నెలలో ఆ ఉత్సాహం కనిపించదు. వృత్తిలో ఎదుగుదల లేనట్లు అనిపించవచ్చు. కొత్తగా ఏదైనా ఆలోచించాలన్నా బుర్ర పని చేయనట్లు ఉంటుంది. ఇది ఓటమి కాదు, ఒక విరామం మాత్రమే. భవిష్యత్తులో వచ్చే పెద్ద మార్పు కోసం ప్రకృతి మిమ్మల్ని సిద్ధం చేస్తోంది.

 కర్మ గ్రహాల ప్రభావం 
శని, రాహు, కేతువుల ప్రభావం వల్ల మనం మన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటాం. మీ సంబంధాలు, ఉద్యోగం, లక్ష్యాలు మీకు నిజంగా సంతోషాన్ని ఇస్తున్నాయా.... అని ఆలోచిస్తారు. అవసరం లేని పనులను, వ్యక్తులను వదిలించుకోవడానికి ఇది మంచి సమయం.

ఈ కాలాన్ని చూసి భయపడకుండా, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఇందుకు ఎం చేయాలంటే:
*రోజూ ధ్యానం చేయండి.
* పూర్తి కానీ పనులను పూర్తి చేయండి.
*శరీరానికి తగినంత విశ్రాంతి, నిద్ర ఇవ్వండి.
*ఓర్పుతో వ్యవహరించండి.

ఎం  చేయకూడదంటే:
*తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు.
*మీ వేగాన్ని ఇతరులతో పోల్చుకోవద్దు.
*పనులు ఆలస్యం అవుతున్నాయని అతిగా ఆందోళన పడొద్దు.

చివరగా మే 2026 నెల అనేది విశ్వం తీసుకునే చిన్న విరామం. పనులు ఆగిపోయాయని బాధపడకుండా, ఈ సమయాన్ని మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి వాడుకోండి. ఈ నిశ్శబ్దం వెనుక ఒక పెద్ద విజయం దాగి ఉంటుందని గుర్తుంచుకోండి.

 Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.