
కొన్ని కాంబినేషన్స్‌ని అస్సలు ఊహించలేం. కానీ వారిని కలపాలని సడెన్‌గా ఏ దర్శకుడికో ఆలోచన వస్తుంది. అది కాస్తా సెన్సేషన్ అవుతుంది. ఇప్పుడు అలాంటి ఓ క్రేజీ కాంబో గురించి సౌత్ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. అదే మహేష్ బాబు, కమల్ హాసన్‌ల కాంబో. ఈ ఇద్దరు స్టార్స్ కలిసి ఒకే సినిమాలో కనువిందు చేయనున్నారనే వార్త జోరుగా వినిపిస్తోంది. వీరిద్దర్నీ కలపబోతున్నది ఎవరో కాదు.. డైరెక్టర్ మురుగదాస్ అట. కమల్, మహేష్‌లని దృష్టిలో ఉంచుకుని మురుగదాస్ఓ పవర్ ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేశాడట. మహేష్ సీబీఐ ఆఫీసర్‌గా కనిపిస్తాడట. కమల్ ఓ యువతికి తండ్రి పాత్రలో నటిస్తారట. ఈ రెండు క్యారెక్టర్లకి సంబంధం ఏంటనేది ఇంటరెస్టింగ్‌గా ఉంటుందట. ఇది ఒక ఎమోషనల్ సబ్జెక్ట్ అని, దానికి వీరిద్దరూ పర్‌ఫెక్ట్ అని మురుగదాస్ ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుందనే ప్రచారం జరుగుతోంది. డిఫరెంట్ మూవీస్ చేయడానికి మహేష్ ఎప్పుడూ ముందుంటాడు. కథ నచ్చితే మల్టీస్టారర్స్ చేయడానికీ వెనుకాడడు. ఆల్రెడీ వెంకటేష్, నరేష్ వంటి వారితో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇక కమల్ అంటే కచ్చితంగా నో అనలేని నటుడు. వీరిద్దరూ కలిస్తే ఆ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మురుగదాస్ మహేష్‌తో ‘స్పైడర్’ చిత్రాన్ని తెరకెక్కించాడు. అది ఫెయిలవడంతో మహేష్‌తో ఓ పవర్ ఫుల్ మూవీ చేసి హిట్టు కొట్టాలనే కసితో ఉన్నాడు. కాబట్టి తన కథతో కన్విన్స్ చేస్తే ప్రాజెక్ట్ సెట్టవడం ఖాయం. మరి అవుతుందో లేదో వేచి చూడాల్సిందే!