మహిళా పోలీసుపై గ్యాంగ్ రేప్.. వీడియో తీసి బెదిరింపు

 మహిళా పోలీసుపై గ్యాంగ్ రేప్..  వీడియో తీసి బెదిరింపు
  • ప్రధాన నిందితుడు, సహకరించిన తల్లి అరెస్టు
  • మొత్తం ఐదుగురిపై కేసు నమోదు

నీముచ్: నమ్మి ఇంటికి వచ్చిన మహిళా కానిస్టేబుల్ నే కామాంధులు చెరబట్టారు. తీయటి మాటలతో పరిచయం పెంచుకుని.. పుట్టిన రోజు వేడుకకు ఆహ్వానించి.. ఒంటరిగా వచ్చిన మహిళా కానిస్టేబుల్ ను ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. అంతేకాదు సదరు అత్యాచారాన్ని వీడియో తీసి బెదిరించారు. మూడు వారాల క్రితమే ఘటన జరుగగా మహిళా కానిస్టేబుల్ అయిన బాధితురాలు ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. మరో దారుణమైన విషయం ఏమిటంటే కన్న కొడుకే నమ్మి వచ్చిన మహిళపై అత్యాచారానికి పాల్పడుతుంటే అతని తల్లే సహకరించి కటకటాలు లెక్కిస్తోంది.పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సీముచ్ జిల్లాలో బాధితురాలైన 30 ఏళ్ల మహిళ కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. ప్రధాన నిందితుడు గత ఏప్రిల్ లో సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడు. తరచూ మెసేజీలు పెట్టి మహిళా కానిస్టేబుల్ కు మరింత దగ్గరయ్యాడు. తనతో చనువు పెరగడంతో తరచూ ఛాటింగ్ చేస్తూ 3 వారాల క్రితం తన సోదరుడి పుట్టిన రోజు వేడుకకు రావాలని ఆహ్వానించాడు. నీముచ్ జిల్లా నుంచి ఇండోర్ జిల్లాకు బదిలీపై వెళ్లింది. అయినప్పటికీ తనతో సోషల్ మీడియా ద్వారా పరిచయం కొనసాగిస్తున్న వ్యక్తి చాలా హుందాగా ఆహ్వానించడంతో ఏమాత్రం అనుమానించకుండా పుట్టిన రోజు వేడుకకు వెళ్లింది. అయితే అక్కడకు వెళ్లిన బాధితురాలిని కామాంధుడు చెరబట్టాడు. తనతోపాటు మరో ఇద్దరు స్నేహితులతో కలసి సామూహిక అత్యాచారం జరిపారు. అంతేకాదు మొత్తం ఘటనను వీడియో తీసి మహిళా కానిస్టేబుల్ ను బెదిరించారు. దీంతో ఆమె ఎవరికీ చెప్పుకోలేక తీవ్రంగా బాధపడింది. వీడియో వారి చేతిలో ఉండడంతో పరువుపోతుందేమోనని బాధితురాలు మిన్నకుండిపోగా.. వారి బంధువు ఒకరు డబ్బులు డిమాండ్ చేయడంతో సహించలేకపోయింది. ఈనెల 13న ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఫిర్యాదు తీసుకుని నిందితుడి కోసం వేట మొదలుపెట్టారు. సాక్షాధారాలు దొరకడంతో ప్రధాన నిందితుడు సహా అతనికి సహకరించిన తల్లిని కూడా శనివారం అరెస్టు చేశారు. మహిళా పోలీసుపైనే గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఘటన కలకలం సృష్టిస్తోంది. 

మరిన్ని వార్తల కోసం..

 

స్టూడెంట్స్ తయారు చేసిన 75 శాటిలైట్స్ లాంచింగ్

పాకిస్థాన్‌కు కొట్టినట్టుగా జవాబు.. ఎవరీ స్నేహా దూబే?

ప్రజల మంచి కోసం తాలిబాన్లకు అండగా నిలుద్దాం: ఇమ్రాన్