భారత్ ఎదిగితే.. ప్రపంచం ఎదుగుతుంది

V6 Velugu Posted on Sep 25, 2021

  • భారత్ రిఫామ్స్ తెస్తే.. ప్రపంచం ట్రాన్స్‌ఫామ్ అవుతుంది
  • స్టూడెంట్స్ తయారు చేసిన 75 శాటిలైట్స్ లాంచ్ చేస్తం

భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొన్న సందర్భంగా ఈ ఏడాది స్టూడెంట్స్ తయారు చేసిన 75 శాటిలైట్స్‌ను స్పేస్‌లోకి పంపబోతోందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. న్యూయార్క్‌లోని ఐక్య రాజ్యసమితి కేంద్ర కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి ఆయన శనివారం ప్రసంగించారు. ‘‘ఈ ఏడాది ఆగస్టు 15తో భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలవుతోంది.  మా దేశంలో వివిధ జాతులు, మతాలు, భాషలు, సంస్కృతుల భిన్నత్వమే.. బలమైన ప్రజాస్వామ్యానికి చిహ్నంగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు రైల్వే స్టేషన్‌లో చాయ్‌ అమ్మిన వ్యక్తి ఈ రోజు మీ ఎదుట యూఎన్ జనరల్ అసెంబ్లీలో నాలుగోసారి ప్రసంగిస్తున్నాడు. అభివృద్ధి అనేది సమ్మిళితంగా ఉండాలి. ప్రతి ఒక్కరి బతుకుల్లో మార్పు తెచ్చేలా ఉండాలి. ఈ దిశగా భారత్ అడుగులేస్తోంది” అని మోడీ అన్నారు. ప్రస్తుతం భారత్ సమగ్ర, సమాన అభివృద్ధి దిశగా అడుగులేస్తోందని, ఏ ఒక్కరూ వెనకబడి ఉండకూదన్న లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు. 

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింతగా వికేంద్రీకరణ జరగాల్సి ఉందని కరోనా మహమ్మారి మనకు నేర్పిందని మోడీ అన్నారు. అందుకే గ్లోబల్ వ్యాల్యూ చెయిన్స్‌ విస్తరించాలని, ఈ అంశం ఆధారంగానే ఆత్మనిర్భర్‌‌ భారత్ అభియాన్‌ రూపుదిద్దుకొందని చెప్పారు. ‘‘భారత్ ఎదిగితే ప్రపంచం ఎదుగుతుంది.. భారత్ సంస్కరణలు (రిఫామ్స్) తెస్తే.. ప్రపంచంలో మార్పు (ట్రాన్స్‌ఫామ్స్) వస్తుంది” అని మోడీ అన్నారు. 

మరిన్ని వార్తల కోసం..

 

పాకిస్థాన్‌కు కొట్టినట్టుగా జవాబు.. ఎవరీ స్నేహా దూబే?

బుద్ధి మార్చుకోని పాక్‌.. తిప్పికొట్టిన భారత్

ప్రజల మంచి కోసం తాలిబాన్లకు అండగా నిలుద్దాం: ఇమ్రాన్

నేను మగాడినే..  అయితే ఏంటి!: తాప్సీ

Tagged pm modi, India, World, UNGA

Latest Videos

Subscribe Now

More News