మహా​శివుడిపై నోట్ల వర్షం.. ఆమెది అహంకారమా.. భక్తా..

మహా​శివుడిపై నోట్ల వర్షం.. ఆమెది అహంకారమా.. భక్తా..


కేదార్ నాథ్ ధామ్ అంటే శివుడు పుణ్యక్షేత్రం.. పవిత్రమైన ప్రదేశం. అందులోనూ గర్భ గుడిలో కొలువైన శివయ్య దగ్గరకు వెళ్లేటప్పుడు ఎంతో భక్తితో వెళతారు భక్తులు. అలాంటి గర్భ గుడిలోని.. శివుడి.. శివ లింగంపై ఓ మహిళ తన దగ్గర ఉన్న డబ్బును వెదజల్లింది. గర్భ గుడిలోని శివ లింగంపై నోట్లను విసిరింది.. గర్భ గుడిలో పైకి వెదజల్లింది. ఇదంతా కెమెరాలో రికార్డ్ కావటం.. అది సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావటం సంచలనంగా మారింది. 

కేదార నాథ్ ఆలయం.. గర్భ గుడిలో ఈ మహిళ చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. 2023, జూన్ 19వ తేదీ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. శివుడి ముందే కుప్పిగంతులా.. ఆమెకు ఎంత అహంకారం అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి చేష్టలను ఆలయం నిర్వహకులు ఎలా అనుమతి ఇచ్చారంటూ దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు. శివుడు అంటే మోక్ష కారకుడు.. అలాంటి శివయ్యపైనే నోట్లతో అభిషేకం చేస్తుందా.. ఎంత అహంకారం ఉంటే ఇలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు భక్తులు. డబ్బులు ఉంటే పేదలకు పంచి పెట్టొచ్చు.. అలా కాకుండా కేదార్ నాథ్ లోని గర్భ గుడిలోనే ఇలా నోట్లను వెదజల్లటం ఏంటనే ప్రశ్న తలెత్తుతుంది. 

భక్తుల నుంచి వస్తున్న విమర్శలపై కేదార్ నాథ్ ఆలయం స్పందించింది. ఆ మహిళపై పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖ రాశారు. అదే విధంగా ఇలాంటి చర్యలు భవిష్యత్ లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామంటూ భక్తులకు హామీ ఇచ్చారు ఆలయ నిర్వహకులు. 

https://publish.twitter.com/?query=https%3A%2F%2Ftwitter.com%2FGarv_verma7%2Fstatus%2F1670694085123018754&widget=Tweet