ఢిల్లీలో దారుణం.. పట్టపగలే బాలికపై కత్తితో దాడి చేసిన యువకుడు

ఢిల్లీలో దారుణం.. పట్టపగలే బాలికపై కత్తితో దాడి చేసిన యువకుడు

దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలే దారుణం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న బాలికపై ఓ దుర్మార్గుడు కత్తితో అటాక్ చేశాడు. వేగంగా అటునుంచి వచ్చి యువతిపై కత్తితో పొడవడం స్టార్ట్ చేశాడు. అటుగా వస్తున్న కొందరు చూసి బెదిరించడంతో అక్కడి నుంచి పారిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌లో మంగళవారం మధ్యాహ్నం యువకుడు అమన్ రెచ్చిపోయాడు. 

అందరూ చూస్తుండగా బాలికపై దాడి చేశారు. రోడ్డుపై వెళ్తున్న బాలికపై కత్తితో ఒక్కసారిగా అటాక్ చేశాడు. అమన్‌ను స్థానికులు అడ్డుకుని పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు వెంటనే బాలికను ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

దర్యాప్తులో అమన్ దాడి చేసిన దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి. వాటిని పరిశీలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించి మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.