ఐఫోన్ 17కి మించి షియోమీ కొత్త సిరీస్..ఈసారి ఫీచర్స్ వేరే లెవెల్..

ఐఫోన్ 17కి మించి షియోమీ కొత్త సిరీస్..ఈసారి ఫీచర్స్ వేరే లెవెల్..

చైనా ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ   షియోమీ (Xiaomi) చైనాలో  కొత్తగా 17 సిరీస్ స్మార్ట్ ఫోన్‌లను లాంచ్ చేసింది. ఈ కొత్త సిరీస్‌లో Xiaomi 17, Xiaomi 17 Pro, Xiaomi 17 Pro Max ఉన్నాయి. ముఖ్యంగా చైనీస్-మొబైల్ తయారీ సంస్థ ఆపిల్ ఐఫోన్ 17 లైనప్‌కి పోటీ ఇస్తూ 17 సిరీస్‌ విడుదల చేసింది.  Xiaomi 17 సిరీస్‌లోని మొత్తం మూడు మోడళ్లు Qualcomm Snapdragon 8 Elite Gen 5 చిప్‌తో వస్తున్నాయి. కొత్త సిరీస్‌లో లైకా-ట్యూన్ చేసిన కెమెరా, ఆండ్రాయిడ్ 16 HyperOS 3, IP68-రేటెడ్ డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ అలాగే పవర్ ఫుల్ బ్యాటరీ వంటి లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. 

Xiaomi 17 : Xiaomi 17 6.3-అంగుళాల LTPO OLED డిస్ ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 3,500 nits పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తున్న బేస్ మోడల్. ఈ  ఫోన్ 16GB RAM, 512GB స్టోరేజ్‌తో వస్తుంది. దీనిలో 100W వైర్డ్ & 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 7,000mAh బ్యాటరీ ఉంది.  50MP ప్రైమరీ సెన్సార్‌తో ఇమేజింగ్ కోసం లైకా-బ్యాక్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చారు.  60fps వద్ద 4K వీడియో రికార్డ్ చేయడానికి 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.

ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5
కెమెరాలు: 50MP ప్రైమరీ + 50MP అల్ట్రా-వైడ్ + 50MP టెలిఫోటో (2.6x) బ్యాక్ కెమెరా.  

ధర: 12GB + 256GB CNY 4,499 యువాన్ అంటే రూ. 56వేలు, 12GB + 512GB CNY 4,799 యువాన్ అంటే రూ. 60వేలు, 16GB + 512GB CNY 4,999 యువాన్ అంటే రూ. 62వేలు. 

Xiaomi 17 ప్రో: ఈ మోడల్ 6.3-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz 3,500 నిట్‌ పీక్ బ్రైట్ నెస్,  2.7-అంగుళాల బ్యాక్  డిస్‌ప్లే కూడా ఉంది. ఈ బ్యాక్ డిస్‌ప్లే నోటిఫికేషన్‌లు, సెల్ఫీలు, మ్యూజిక్ కంట్రోల్ ఇతర వాటిని చూపిస్తుంది. ఈ ఫోన్ 22.5W రివర్స్ ఛార్జింగ్‌తో ,6300mAh బ్యాటరీతో వస్తుంది. లైకా-ట్యూన్డ్ ఆప్టిక్స్‌ కూడా ఉంది, ఇందులో 5x ఆప్టికల్ జూమ్‌తో పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి.

స్పెసిఫికేషన్లు:
*సెకండరీ డిస్ ప్లే: 2.7-అంగుళాల (904 × 572px), 
*ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5
*కెమెరాలు: 50MP ప్రైమరీ + 50MP అల్ట్రా-వైడ్ + 50MP 5x పెరిస్కోప్ + ToF బ్యాక్ కెమెరా ఉంది. దీనికి 50MP ఫ్రంట్ కెమెరా ఉంది.
*RAM: 16GB వరకు
*ఇంటర్నల్ స్టోరేజ్ : 1TB UFS వరకు
*ఆపరేటింగ్ సిస్టమ్: హైపర్ OS 3
*కలర్స్ : తెలుపు, కోల్డ్ స్మోక్ పర్పుల్, నలుపు

ధర: 12GB + 256GB CNY 4,999 (రూ. 62,300), 12GB + 512GB CNY 5,299 (రూ. 66వేలు), 16GB + 512GB CNY 5,599 (రూ. 69,700), 16GB + 1TB CNY 5,999 (రూ. 74,700). 

Xiaomi 17 Pro Max: ఇదొక 6.9-అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో టాప్-ఎండ్ మోడల్. దీనికి కూడా 2.9-అంగుళాల పెద్ద బ్యాక్  స్క్రీన్ ఉంది. ఈ మోడల్ ట్రిపుల్-కెమెరా సెటప్‌తో వస్తుంది. అలాగే 50MP ప్రైమరీ సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో (5x ఆప్టికల్ జూమ్) ఉంది. ఈ మొబైల్ 7,500mAh పవర్ ఫుల్ బ్యాటరీతో వస్తుంది. 100W వైర్డు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్  ఇస్తుంది. ప్రో మోడల్‌తో పోలిస్తే ఈ ఫోన్ బెస్ట్ వాటర్ రిసిస్టెంట్ కూడా. 

స్పెసిఫికేషన్లు:
*సెకండరీ డిస్ ప్లే: 2.9-అంగుళాలు (976 × 596px), 
*ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5
*RAM: 16GB వరకు
*ఇంటర్నల్ స్టోరేజ్: 1TB వరకు UFS 4.1
*ఛార్జింగ్: 100W హైపర్‌ఛార్జ్/ PPS, 50W వైర్‌లెస్, 22.5W రివర్స్
*ఆపరేటింగ్ సిస్టమ్: హైపర్ OS 3
కెమెరా: దీనిలో 50MP ప్రైమరీ + 50MP అల్ట్రా-వైడ్ + 50MP 5x టెలిఫోటో బ్యాక్ కెమెరా, 50MP (90-డిగ్రీల FoV) కెమెరా ఉన్నాయి.

ధర : 12GB + 512GB CNY 5,999 (రూ. 74,700), 16GB + 512GB CNY 6,299 (రూ. 78,500), 16GB + 1TB CNY 6,999 (రూ. 87,200)