చీరల పంపిణీ బంద్.. రుణమాఫీ నిలిపివేత

చీరల పంపిణీ బంద్.. రుణమాఫీ నిలిపివేత

యాదాద్రి, వెలుగు:  ఎన్నికల కోడ్​ కారణంగా సంఘాల మహిళలకు చీరల పంపిణీ నిలివివేశారు. చేనేత కార్మికుల రుణమాఫీ కూడా ఆగిపోయింది. ఇందిరమ్మ జయంతి సందర్భంగా యాదాద్రి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని సంఘాల మహిళలకు చీరల పంపిణీని ప్రారంభించారు. 1.80 లక్షల మంది మహిళలకు చీరలు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే బుధవారం ఎన్నికల కోడ్​ వచ్చే సమయానికి 1.57 లక్షల మందికి చీరలను పంపిణీ చేశారు. 

అనంతరం నిలిపివేశారు.  రూ. లక్షలోపు రుణాలు తీసుకున్న చేనేత కార్మికులకు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో యాదాద్రి జిల్లాలోని 2వేల మందికి పైగా చేనేత కార్మికులు తీసుకున్న రూ. 19.24 కోట్లు మాఫీ చేయాలని యాదాద్రి జిల్లా కమిటీ సిఫారసు చేసింది. ఈ మొత్తంలో మొదటి విడతగా ప్రభుత్వం 50 శాతం అమౌంట్​ రిలీజ్​ చేసింది. రిలీజ్​అయిన అమౌంట్​జిల్లా చేనేత జౌళీ శాఖ అకౌంట్​లో జమ అయ్యాయి. అప్పటికే ఎన్నికల కోడ్​అమల్లోకి రావడంతో లబ్ధిదారుల అకౌంట్లలో రుణమాఫీ సొమ్ము జమ చేయలేదు.