బ్యాంకు నిధుల మళ్లింపు.. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు

V6 Velugu Posted on Jun 09, 2021

న్యూఢిల్లీ: యెస్ బ్యాంకులో నిధుల మళ్లింపు కేసులో సీబీఐ బుధవారం దేశ వ్యాప్తంగా 14 చోట్ల సోదాలు నిర్వహించింది. ఢిల్లీ, కోల్ కతా, ముంబయి, హైదరాబాద్, లక్నో తదితర ప్రధాన నగరాల్లో 14 చోట్ల తనిఖీలు చేసినట్లు సీబీఐ అధికార వర్గాల సమాచారం. 2017..19లో రూ.466 కోట్లకుపైగా నిధులను మళ్లించిన వైనం వెలుగులోకి రావడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
అయితే ఈ కేసులో ఇప్పటికే నిందితుడిగా ఉన్న అవంత గ్రూప్ ప్రమోటర్ గౌతమ్ థాపర్ పై తాజాగా జరిపిన సోదాల్లో మరిన్ని ఆధారాలతో  ఇంకో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం. అలాగే ఒయిస్టర్ బిల్డ్ వెల్ ప్రైవేట్ లిమిటెడ్(ఓబీపీఎల్), అవంత రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్(ఏపీఎల్), జాబువా పవర్ ప్రైవేట్ లిమిటెడ్ (జేపీఎల్) సంస్థల డైరెక్టర్లు రఘుబీర్ కుమార్, రాజేంద్రకుమార్ మంగళ్, తాప్సీ మహజన్ తదితరులపై కూడా కేసు నమోదు చేశారు.  బ్యాంకు మాజీ చీఫ్ రాణా కపూర్ కు సైతం సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 

Tagged CBI raids, , Yes Bank case, cbi across india, cbi registers fresh FIR, Gautam Thapar and co, money diversion from bank

Latest Videos

Subscribe Now

More News