యూఏఎన్ లేకున్నా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు

యూఏఎన్ లేకున్నా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు

న్యూఢిల్లీ:చాలా మంది ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలో మార్పులు చేర్పుల కోసం, బ్యాలెన్స్ చెక్ చేయడానికి యూనిక్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) తీసుకుంటారు కానీ, తరువాత నంబరు మర్చిపోతారు. దీంతో సమస్యలు ఎదురవుతాయి యూఏఎన్, పాస్‌‌‌‌వర్డ్‌‌ లేకుండా కూడా పీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.  ఈ కొత్త విధానం ప్రకారం.. ఈపీఎఫ్‌‌వో సభ్యుడు ఈపీఎఫ్‌‌వో అధికారిక పోర్టల్‌‌లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తరువాత యూఏఎన్ లేకుండా పీఎఫ్ బ్యాలెన్స్‌‌ను తెలుసుకోవడానికి ఇలా చేయాలి. 
1:    ఈపీఎఫ్‌‌వో హోమ్ పేజీ  https://www.epfindia.gov.in లో లాగిన్ కావాలి.
2:    సైట్‌‌లో ‘క్లిక్ హియర్ టు నో యువర్ ఈపీఎఫ్ బ్యాలెన్స్’ అనే ఆప్షన్‌‌పై  క్లిక్ చేయాలి.
3:    ఇది https://www.epfoservices.in/ep fo  అనే పేజీకి తీసుకెళ్తుంది. అప్పుడు ‘మెంబర్ బ్యాలెన్స్ ఇన్ఫర్మేషన్’ సెక్షన్‌‌కు వెళ్లాలి. 
4:    మీరు పనిచేసే రాష్ట్రాన్ని ఎంచుకోవాలి. ఈపీఎఫ్ ఆఫీసు, ఎస్టాబ్లిష్మెంట్ కోడ్, పీఎఫ్ ఖాతా సంఖ్య  వంటి వివరాలను ఇవ్వాలి.
5:    ‘సబ్మిట్’ ఆప్షన్ పై క్లిక్ చేయగానే, మీ పీఎఫ్ బ్యాలెన్స్ కనిపిస్తుంది.  ఎస్ఎంఎస్ లేదా మిస్డ్ కాల్ సర్వీస్ ద్వారా యూఏఎన్ నంబరుతోనూ పీఎఫ్ బ్యాలెన్స్‌‌ను తెలుసుకోవచ్చు. ఎస్ఎంఎస్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి, ఎకౌంట్‌‌ హోల్డర్‌‌   రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 7738299899 కు EPFOHO UAN  అని ఎస్ఎంఎస్ పంపాలి.  రిప్లై మెసేజ్‌‌లో పీఎఫ్ బ్యాలెన్స్ కనిపిస్తుంది.  రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 011-22901406 నంబరుకు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా బ్యాలెన్స్‌‌ను చూసుకోవచ్చు.