మీకు రీల్స్ చేయడమంటే ఇష్టమా..అందరి కంటే భిన్నంగా రీల్స్ చేస్తారా..రీల్స్ తో ఆకట్టుకుంటారా..అయితే మీరు లక్ష రూపాయలు గెలుచుకునే ఛాన్స్ ..ఎందుకంటే రీల్స్ చేసేవారికి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రభుత్వం చెప్పిన కంటెంట్ పై రీల్స్ చేసి మెప్పిస్తే లక్షరూపాయలు ఇస్తామని వెల్లడించింది.
ఇంతకీ ఏం చేయాలంటే..
హ్యాపెనింగ్ హైదరాబాద్ షార్ట్ వీడియో కాంటెస్ట్ ను తెలంగాణ రాష్ట్ర శాఖ డిజిటల్ మీడియా ప్రకటించింది. హైదరాబాద్‌లో అద్భుతమైన ప్రదేశాలను ఎంపిక చేసుకుని రీల్స్ చేయాలని సూచించింది. హైదరాబాద్ ప్రజల జీవనానికి ఎంత అనుకూలంగా ఉంటుందో నిరూపించేలా రీల్స్ చేయాలని నిబంధన పెట్టింది. తమ సోషల్ మీడియాలో పోస్టు చేసుకుని @DigitalMediaTS కు ట్యాగ్ చేయాలి. ఈ రీల్స్ కాంటెస్ట్‌లో భాగంగా యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రాం, ట్విట్టర్‌లో తమ షార్ట్ వీడియోస్ పోస్ట్ చేసే అవకాశం కల్పించింది.
నిబంధనలేంటి..
హైదరాబాద్ పై రీల్ చేసిన కంటెంట్ జనవరి ఒకటి 2023 తర్వాత చేసినదై ఉండాలి. ఈ రీల్ 60 సెకండ్లు మించకూడదు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి అనుకూలంగా ఉండాలి. 8 ఏళ్ల పైబడిన వారు రీల్స్ చేసి పంపొచ్చు. ఈ కాంటెస్ట్ కి సంబంధించి రీల్స్ ఏప్రిల్ 30 తేదీలోపు పంపించాలి. మే రెండవ వారంలో విజేతలను వెల్లడిస్తారు. ఈ పోటీలో పాల్గొనేవారుమరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం https://it.telangana.gov.in/contest/ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
