జీవితంలో ఓటమిని ఒప్పుకున్న క్షణమే.. నిజమైన ఓటమి.. హర్షసాయి మూవీ టైటిల్ టీజర్ రిలీజ్

జీవితంలో ఓటమిని ఒప్పుకున్న క్షణమే.. నిజమైన ఓటమి..  హర్షసాయి మూవీ టైటిల్ టీజర్ రిలీజ్

యూట్యూబర్ హర్షసాయి(Harsha Sai) హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ (సెప్టెంబర్ 17న) సినిమా టైటిల్..టీజర్ రిలీజ్ అయింది. పాన్ ఇండియా రేంజ్‍లో తెరకెక్కుతున్న ఈ మూవీ డిఫరెంట్ యాక్షన్ బ్యాక్‍డ్రాప్‍లో ఇంటెన్స్గా ఉంది. ఈ మూవీకి స్వయంగా హర్షసాయి స్టోరీని అందిస్తూ డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీకి 'మెగా'(MEGA) అని టైటిల్ రిలీజ్ చేయగా..'లో డాన్’ అనే (MEGA - Lo Don) క్యాప్షన్ ఇచ్చారు మేకర్స్. 

టీజర్ విషయానికి వస్తే.. ఒక పెద్ద గంటకు హీరో హర్షసాయిని కట్టేసి కొందరు శిక్ష విధించే సీన్‍తో ‘మెగా - లో డాన్’ టీజర్ స్టార్ట్ అవ్వగా..హీరో హర్షసాయి వీపుపై ఉన్న డిఫరెంట్ టాటూను హైలైట్ చేస్తూ..ఆడియన్స్ లో ఆసక్తి పెంచేశారు. క్రూరమైన ఓ వింత మనిషి, చుట్టూరా రౌడీలతో ఉన్న ఈ  టీజర్ ఎలివేషన్ అదిరిపోయింది. అలాగే అక్కడ ఉన్న పెద్ద గంట యొక్క విశిష్టతను..వివరిస్తున్న డాక్టర్ మాటలు స్టోరీపై ఆసక్తి  కలిగిస్తుంది.
ఈ టీజర్లో హీరో హర్ష సాయి డైలాగ్ ఆకట్టుకుంటోంది..జీవితంలో ఓటమిని ఒప్పుకున్న క్షణమే.. నిజమైన ఓటమి..నన్ను చూస్తే ఒప్పుకునే వాడిలా కనిపిస్తున్నానా..అంటూచెప్పిన డైలాగ్ హర్షసాయి యొక్క రియల్  లైఫ్ క్యారెక్టర్ను తెలియజేస్తుంది. ఆ తర్వాత హర్షకు ఓ ఆత్మ కనిపిస్తుంది.  మెగా -లో డాన్ అనేది అత్యంత భారీ జంతువు అని ఈ టీజర్‌లో అర్ధం అవుతుంది. ఇక టీజర్ ఎండింగ్లో వచ్చిన..ఈ కథ రాక్షసులతో నిండిన సముద్రాన్ని కుదిపేసి రాజైన మనిషి కథ..అంటూ టీజర్ ముగిసింది. 

Also Read :- టాలీవుడ్కి మరో న్యాచురల్​ బ్యూటీ..ఎవరంటే?

ఇక హర్షసాయి విషయానికి వస్తే ఆపదలో ఎవ్వరూ ఉన్న..వారి దగ్గరికి వెళ్లి మరి తన వంతు సాయాన్ని అందిస్తారు. అంతేకాకుండా..యూట్యూబర్‌గా హర్హసాయి అంటే చాలా పాపులర్. అతడి యూట్యూబ్ ఛానెల్‍కు 9 మిలియన్లకు పైగా సబ్‍స్క్రైబర్లు ఉన్నారు. ఇక రైటర్,డైరెక్టర్గా రాబోతున్న ఈ మెగా మూవీతో..మెగాఎంట్రీ ఇస్తాడో..లేదో చూడాలి. 

శ్రీ పిక్చర్స్ పతాకంపై బిగ్‍బాస్ ఫేమ్ మిత్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కల్వకుంట్ల వంశీధర రావు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. వికాస్ బాడిస ఈమూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు.