సినీ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీల హవా నడుస్తోంది. సాయి పల్లవితో మొదలైన ఈ ట్రెండ్ రోజురోజుకీ ఊపందుకుంటోంది. రష్మిక మందన్నా, కీర్తి సురేశ్ వంటి స్టార్ హీరోయిన్లు సైతం డీ గ్లామర్ రోల్స్‌తో మెప్పిస్తున్నారు.
లేటెస్ట్ గా.. ఇప్పుడు అదే బాటలో మరో యంగ్ బ్యూటీ వచ్చేస్తోంది. ఇటీవల కన్నడలో సూపర్ హిట్ అయిన ‘సప్త సాగర దాచే ఎల్లో’ అనే సినిమాను తెలుగులో ‘సప్త సాగరాలు దాటి’( Sapta Sagaralu Dhaati) పేరుతో డబ్ చేయనున్నారు. ఇందులో రక్షిత్ శెట్టికి(Rakshith Shetty) జోడీగా రుక్మిణీ వసంత్(Rukmini Vasanth) అనే బెంగళూరు బ్యూటీ నటించింది.
ఆమె న్యాచురల్ లుక్స్‌కి కన్నడ యువత దాసోహం అంటున్నారు. సోషల్ మీడియాలోనే ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్ వైరలవుతున్నాయి. ఈ ఒక్క సినిమాతోనే ఈ హీరోయిన్ కన్నడలో పెద్ద ప్రాజెక్ట్స్‌లో చాన్స్‌లు కొట్టేసింది.
రుక్మిణీ వసంత్..నటన,లుక్స్, సహజంగా ఉంటే కనుక తెలుగు ఆడియన్స్ హక్కున నేర్చుకోవడం కన్ఫర్మ్. ఎంతో మంది నటించిన ఒక్క సినిమాతోనే తెలుగులో చాలా పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్స్ ఉన్నారు. ఇక రుక్మిణీ వసంత్ అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి మరి.
రీసెంట్ గా సప్త సాగరాలు దాటి మూవీ నుండి తెలుగు టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. విభిన్నమైన కాన్సెప్ట్ తో వస్తూన్న ఈ మూవీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే తెలుగులో డబ్బింగ్ పనులు పూర్తీ అయినట్లు సమాచారం.
హేమంత్ ఎం రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న కన్నడ ఆడియన్స్ ముందుకి వచ్చి క్లాసిక్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ సెప్టెంబర్ 22న తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.