'జిమ్ టైమ్' అంటే.. నమాజ్.. కోడ్ భాషతో మతం మార్పునకు వల

 'జిమ్ టైమ్' అంటే.. నమాజ్..  కోడ్ భాషతో మతం మార్పునకు వల

ఘజియాబాద్ మతమార్పిడి కేసులో ప్రధాన నిందితుడు, ముంబై సమీపంలోని థానే నివాసి షానవాజ్ ఖాన్ అలియాస్ బద్దో కోసం వేట కొనసాగుతుండగా.. అతని కార్యనిర్వహణను బహిర్గతం చేసే వాట్సాప్ చాట్‌లను పోలీసులు బట్టబయలు చేశారు. ఈ కేసులో మరో నిందితుడు అబ్దుల్ రెహమాన్ అలియాస్ నన్ని, ఘజియాబాద్ సెక్టార్ 23లోని జామా మసీదుకు చెందిన మౌల్వీని పోలీసులు ఇంతకుమునుుపే అరెస్టు చేశారు.

మే 30న తమ పిల్లాడు అకస్మాత్తుగా రోజుకు ఐదుసార్లు నమాజ్ చేయడం ప్రారంభించాడని ఆరోపిస్తూ ఘజియాబాద్ పోలీస్ స్టేషన్‌లో బాలుడి తండ్రి ఫిర్యాదు చేయడంతో ఈ రాకెట్ బట్టబయలైంది. పిల్లాడిని మందలించడంతో అతను ఇంటి నుంచి వెళ్లిపోయి, మౌల్వీ దగ్గరే ఉంటానని చెప్పినట్టు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఖాన్ ఆన్‌లైన్ గేమ్‌లు, సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపే పిల్లలను ఎంపిక చేసుకునేవాడు. ఈ పిల్లలు ఖురాన్ పద్యాలను చదివితే, అల్లా ఆటలో గెలవడానికి సహాయం చేస్తాడని చెప్పాడు. సర్వర్‌లు ఎక్కువగా వారిచే నియంత్రించబడుతున్నందున కొంతమంది పిల్లలను లక్ష్యంగా చేసుకుని నమ్మించడం ప్రారంభిస్తారు.

నిర్దిష్ట సర్వర్‌లలో చేరమని నిందితులు, పిల్లలు అడిగారు. అలా కొంతమంది పిల్లలు సర్వర్ లో చేరిన తర్వాత, ప్రపంచంలోనే అత్యుత్తమ మతం అస్లాం అని తెలిపే వీడియోలు, ఆడియోలను వారికి చూపించారు. దీంతో వారు మౌల్వీతో కనెక్ట్ అయ్యారు.  ఆ తర్వాత పిల్లలకు నమాజ్ సమయాల్లో ప్రార్థనలు ఎలా చేయాలో నేర్పించాడు.

వాట్సాప్ చాట్స్ లో ఏముందంటే..

నమాజ్ కోసం కోడ్ పదం 'జిమ్ టైమ్' ను ఉపయోగించినట్టు తెలుస్తోంది. కొన్ని చాట్‌లలో పిల్లలు నమాజ్ చేయడం మరచిపోయినా లేదా మానేసినా వారిని తిట్టడం, లేదా దేవుడు కోపం తెచ్చుకుంటాడు అని బెదిరించడం కనిపించింది.
ఖురాన్ శ్లోకాలకు సంబంధించిన కొన్ని లింక్‌లతో పాటు టెలివింజెలిస్ట్ జాకీర్ నాయక్ వీడియోలు కూడా ఈ చాట్స్ లో లభ్యమయ్యాయి. వారిని పిల్లలు పూర్తిగా నమ్మిన తర్వాత.. వారిని నమాజ్ కోసం మస్జిద్‌కు వెళ్లమని చెప్పారు. పాకిస్తాన్ నుంచి పనిచేస్తున్న ఓ యూట్యూబ్ ఛానెల్ ఈ వీడియోలను పిల్లలకు చూపించినట్టు తెలుస్తోంది. సర్వర్లు మిడిల్-ఈస్ట్ నుంచి పనిచేస్తున్నందున ఘజియాబాద్ పోలీసులు అంతర్జాతీయ కోణంలోనూ విచారిస్తున్నారు. కేంద్ర ఏజెన్సీలు కూడా ఈ దర్యాప్తుపై దృష్టి పెట్టాయి. అయితే ఇప్పటివరకు ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) దాఖలు చేయకపోవడం గమనార్హం.