Team India: భారత క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ఇకపై మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు

Team India: భారత క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ఇకపై మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు

భారత క్రికెట్ చరిత్రలో తొలిసారి మూడు ఫార్మాట్ లను ముగ్గురు కెప్టెన్లు నడిపించనున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం (మే 7) టెస్టు ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రిటైర్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకటించాడు. ఇప్పటికే టీ20 ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి తప్పుకున్న హిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్యాన్ వన్డేల్లో కొనసాగుతానని తెలిపాడు. దీంతో రోహిత్ కేవలం వన్డేల్లో మాత్రమే కెప్టెన్సీ చేయనున్నాడు. రోహిత్ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలని డిసైడయ్యాడని, అప్పటిదాకా ఫిట్‌‌‌‌‌‌‌‌గా ఉండేందుకే టెస్టులకు వీడ్కోలు ప్రకటించాడని అతని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.  దీంతో రోహిత్ ను 2027 వన్డే వరల్డ్ కప్ వరకూ కెప్టెన్సీ నుంచి తొలగించే అవకాశాలు దాదాపుగా లేవు.

టీ20 క్రికెట్ లో సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. భారత యువ జట్టు సూర్య కెప్టెన్సీలో తిరుగులేని జట్టుగా దూసుకెళ్తుంది. సూర్య వన్డే, టెస్ట్ ఫార్మాట్ లలో ఆడడం లేదు. అతన్ని కేవలం టీ20 ఫార్మాట్ లోనే కొనసాగుతున్నాడు. 2026 టీ20 వరల్డ్ కప్ కు సూర్య కెప్టెన్ గ ఆకొనసాగడం ఖాయంగా కనిపిస్తుంది. టెస్ట్ కెప్టెన్సీని రోహిత్ శర్మ, సూర్య చేపట్టే అవకాశాలు లేవు. దీంతో ఇప్పుడు కొత్త టెస్ట్ కెప్టెన్ ఎవరనే విషయంలో ఆసక్తి నెలకొంది. రోహిత్ రిటైర్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత వచ్చే నెలలో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియాకు కొత్త కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఎంపిక అనివార్యమైంది. 

జూన్ 20న మొదలయ్యే ఈ టూర్ కోసం సెలెక్టర్లు వారంలో టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రకటించనుండగా..  కెప్టెన్సీ రేసులో బుమ్రా, రాహుల్, శుభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్ గిల్, రిషబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంత్ ఉన్నారు. ప్రస్తుత వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుమ్రాకు ఇప్పటికే  కొన్ని మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో జట్టును నడిపించిన అనుభవం ఉంది. కానీ, ఫాస్ట్ బౌలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావడం, తరచూ గాయాలు అవుతున్నందున బుమ్రాను ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైమ్ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసే విషయంలో సెలెక్టర్లు, బోర్డు పెద్దలు వెనకడుగు వేస్తున్నారు. బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలకడ లేకపోవడం ప్రతికూలం కానుంది. ఈ నేపథ్యంలో రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒకరికి పగ్గాలు అప్పగించే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనిపిస్తోంది. దీంతో భారత క్రికెట్ లో తొలిసారి మూడు ఫార్మాట్లలో ముగ్గురు కెప్టెన్లను చూడబోతున్నాం.