దేశ వ్యాప్తంగా మూడు రోజులు ఏటీఎంలు బంద్ ..నిజమెంత.?

దేశ వ్యాప్తంగా మూడు రోజులు ఏటీఎంలు బంద్ ..నిజమెంత.?

భారత్ పాకిస్తాన్ యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు దెేశాల మధ్య బాంబ్ ల మోత మోగుతోంది. ఈ క్రమంలో పాకిస్తాన్  మొత్తం 74 దేశాల్లో  సైబర్ అటాక్ చేస్తోందని.. ఇందులో భాగంగా భారత దేశంలో రెండు మూడు రోజులు అన్ని ఏటీఎంలు బంద్ అవుతాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.  ఈ క్రమంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూర్ (పీఐబీ) క్లారిటీ  ఇచ్చింది. 

సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న మెసేజ్ ఫేక్ అని చెప్పింది. దీనిని  ఎవరూ నమ్మోద్దని సూచించింది. ఏటీఎంలు తెరిచే ఉంటాయని చెప్పింది. ఇలాంటి ఫేక్ మెసెజ్ లను సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని సూచించింది.

మరో వైపు భారత్ పాక్ మధ్య బాంబుల మోత మోగుతోంది. పాకిస్థాన్ డ్రోన్లను గాల్లోనే పేలుస్తుంది. భారత దాటికి పాక్ అతలాకుతలం అవుతోంది. సరిహద్దులో కూడా పాక్ కు  ధీటుగా కాల్పులు జరుపుతోంది.చొరబాటు దారులను హతమారుస్తోంది.  పాకిస్తాన్ కు ఓ వైపు ఇండియా నుంచి మరో వైపు బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి దాడి ఎదురువుతోంది.