10 ఎకరాల కబ్జా భూమి స్వాధీనం

10 ఎకరాల కబ్జా భూమి స్వాధీనం

చేవెళ్ల, వెలుగు: మొయినాబాద్​ మండలం అజీజ్​నగర్​ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 178లో ఓ రియల్​ ఎస్టేట్​ వ్యాపారి 10 ఎకరాల భూమిని కబ్జా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆ భూమి చుట్టూ ప్రహరీ నిర్మించగా బుధవారం రెవెన్యూ అధికారులు కూల్చేశారు. కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమి విలువ సుమారుగా రూ.200 కోట్లు ఉంటుందని స్థానికులు తెలిపారు. తహసీల్దార్ గౌతంకుమార్, ఆర్ఐ రాజేశ్​, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.