V6 News

మేడ్చల్ లో 10 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమికి ఎసరు

మేడ్చల్ లో 10 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమికి ఎసరు
  • బాచుపల్లిలో రూ.200 కోట్ల ల్యాండ్ కొట్టేసేందుకు ప్లాన్
  • తప్పుడు పత్రాలు సృష్టించిన పెద్దలు

హైదరాబాద్, వెలుగు: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బాచుపల్లిలో 10 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమిని పట్టాగా మార్చుకునేందుకు కొందరు ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ ఎకరా రూ.20 కోట్లు పలుకుతున్నది. అందులో భాగంగానే దీన్ని కొట్టేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ సీలింగ్ ల్యాండ్స్​పై ప్రభుత్వానికి ఇప్పటికే పలువురు కంప్లైంట్స్ ఇచ్చారు. ప్రభుత్వ సీలింగ్ భూమిని వ్యక్తిగత పట్టాగా మార్చొద్దని.. వందల కోట్ల విలువ చేసే భూమిని కాపాడాలని రెవెన్యూ డిపార్ట్​మెంట్ అధికారులను కోరారు. బాచుపల్లి గ్రామంలోని 484, 485, 486 సర్వే నంబర్లలో సీలింగ్ ల్యాండ్​ను 1975లో నోటిఫై చేశారు. అయితే, ఎలాగైనే ఈ ల్యాండ్​ను తమ పేరు మీద చేసుకోవాలని నిర్ణయించుకున్న కొందరు పెద్దలు.. సీలింగ్ ప్రొసీడింగ్ రాకముందు ఒక డాక్యుమెంట్​ను క్రియేట్​ చేసి సేల్ అగ్రిమెంట్ చేశారు. ఇలా తప్పుడు పత్రాలతో పాత తేదీల్లో డాక్యుమెంట్లు తయారు చేసి రెవెన్యూ డిపార్ట్​ మెంట్ ఇన్​వాల్వ్ కాకుండా కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నట్లు తెలిసింది.