జనగామ పట్టణంలో థార్ కారు బీభత్సం సృష్టించింది. అతివేగం, అజాగ్రత్త ఓ ప్రాణం పోయేంత పని అయింది. పట్టణంలోని కూర్మవాడలో ఒక్కసారిగా దూసుకొచ్చిన థార్ కారు బైక్ మెకానిక్ షాపులోకి దూసుకెళ్లింది.
ఆ సమయంలో షాపులో ఉన్న వ్యక్తి అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి క్షణాల వ్యవధిలో పక్కకు తప్పుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. అయితే కారు వేగానికి షాపు ముందు పార్క్ చేసి ఉన్న రెండు ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
కారు నడుపుతున్న వ్యక్తి అజాగ్రత్తగా మితిమీరిన వేగంతో నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు భారీ క్రేన్‌ను రప్పించి, అతి కష్టం మీద కారును అక్కడి నుంచి తొలగించారు.

