ఉప్పల్ మినీ శిల్పారామంలో..థిమాటిక్ ఎగ్జిబిషన్ షురూ

ఉప్పల్ మినీ శిల్పారామంలో..థిమాటిక్ ఎగ్జిబిషన్ షురూ

ఉప్పల్ మినీ శిల్పారామంలో 10 రోజుల హస్తకళల ‘థిమాటిక్ ఎగ్జిబిషన్’ శనివారం ప్రారంభమైంది.  ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అడిషనల్ డైరెక్టర్ శ్రుతి పాటిల్,  హ్యాండీ క్రాఫ్ట్స్ అసిస్టెంట్ డైరెక్టర్ సువర్చలా ముఖ్య అతిథులుగా హాజరై పలు స్టాళ్లను సందర్శించారు.  కొండపల్లి బొమ్మలు, నరసాపురం లేస్, చేర్యాల్ పెయింటింగ్స్, లక్క బొమ్మలు, పామ్ లీఫ్ క్రాఫ్ట్, బొబ్బిన్ లేస్ వంటి హస్తకళల తయారీ విధానాలను తెలుసుకున్నారు.    - వెలుగు, హైదరాబాద్ సిటీ