హైదరాబాద్, వెలుగు: ఈ నెల 1 నుంచి మెట్రో టికెట్లపై ఇస్తున్న 10 శాతం డిస్కౌంట్‌ను రద్దీ వేళల్లో ఎత్తివేస్తున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి 8 వరకు, రాత్రి 8 నుంచి 12 గంటల వరకు మాత్రమే స్మార్ట్ కార్డు, డిజిటల్ టికెట్లపై 10 శాతం డిస్కౌంట్లభిస్తుందని, ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఎలాంటి డిస్కౌంట్లు ఉండవని స్పష్టం చేశారు.
మెట్రో సంస్థ నిన్నటి వరకు స్మార్ట్‌కార్డు, ఫోన్‌పే, పేటీఎం యాప్‌లలో జనరేట్అయిన డిజిటల్ టికెట్లపై 10 శాతం డిస్కౌంట్ ఇచ్చింది. ఇక నుంచి రద్దీ వేళల్లో ఆ అవకాశాన్ని తొలగిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అలాగే హాలిడే సూపర్ సేవర్ ఆఫర్ కార్డు చార్జీని రూ.59 నుంచి రూ.99కు పెంచుతున్నట్లు స్పష్టం చేసింది.
