
న్యూఢిల్లీ: ఎల్‌ఐసీ ఐపీఓని మేనేజ్ చేసేందుకు మొత్తం 10 మర్చంట్ బ్యాంకులను ప్రభుత్వం సెలెక్ట్ చేసింది. ఇందులో గోల్డ్‌మాన్ సాచ్స్ గ్రూప్, జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, కోటక్ మహీంద్రా క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్, సిటీ గ్రూప్, నోమురా హోల్డింగ్స్ వంటి కంపెనీలు ఉన్నాయి. సుమారు 16 దేశీయ, విదేశీ కంపెనీలు ఎల్‌ఐసీ ఐపీఓను మేనేజ్ చేసేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (డీఐపీఏఎం) ముందు తమ ప్రెజెంటేషన్‌ను ఇచ్చాయి. ఇందులో 10 కంపెనీలను షార్ట్ లిస్ట్ చేశారు. మర్చంట్ బ్యాంకర్లను నియమించాక, ఎల్‌ఐసీ వాల్యుయేషన్‌ను లెక్కిస్తారు. తర్వాత డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ పేపర్లను ప్రభుత్వం సెబీకి సబ్మిట్ చేస్తుంది. మిల్లిమన్ అడ్వైజర్స్ ఎల్‌ఎల్‌పీ ఎల్‌ఐసీ వాల్యుయేషన్‌ను లెక్కించడంపై పనిచేయనుండగా, డెలాయిట్, ఎస్‌బీఐ క్యాప్స్ కంపెనీలు ప్రీ ఐపీఓ ట్రాన్సాక్షన్‌కు అడ్వైజర్లుగా పనిచేస్తాయి. వచ్చే ఏడాది జనవరి–మార్చి పిరియడ్‌లో ఎల్‌ఐసీ ఐపీఓ ఉండొచ్చని అంచనా. అంతేకాకుండా విదేశీ ఇన్వెస్టర్లు డైరెక్ట్‌గా ఎల్‌ఐసీ ఐపీఓలో పార్టిసిపేట్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తోంది. సెబీ రూల్స్ ప్రకారం ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) పబ్లిక్ ఆఫర్‌లో షేర్లను కొనుక్కోవచ్చు. కానీ, ఎల్‌ఐసీ చట్టంలో ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్లకు సంబంధించి ఎటువంటి ప్రొవిజన్స్ లేవు. దీంతో ఎఫ్‌పీఐలకు సంబంధించి సెబీ రూల్స్‌కు అనుగుణంగా ప్రభుత్వం ఎల్‌ఐసీ చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది. ఈ ఏడాది జులై 15 న ఎల్‌ఐసీ ఐపీఓకి మర్చంట్ బ్యాంకర్లను నియమించేందుకు డీపీఐఏఎం అప్లికేషన్లను ఆహ్వానించింది.