
నాన్ వెజ్ ప్రియులకి ముందుగా గుర్తొచ్చేది చికెన్ బిర్యానీ మాత్రమే. దీని తరువాతే ఏదైనా.అందులోనూ హైదరాబాదీ దం బిర్యానీ ఎంత పాపులరో కూడా తెలుసు. అదే బిర్యానీ అతి తక్కువ ధర..తక్కువ ధరంటే 100,150కాదు కేవలం పది పైసలికే వస్తే. ఎలా ఉంటుంది. ఒక్కసారి ఊహించుకోండి. రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయి. ట్రాఫిక్ జామ్. పోలీసుల లాఠీ ఛార్జీ అబ్బో ఇలా ఒక్కటేమిటీ అన్నీ రకలా చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటాయి పదిపైసలికే బిర్యానీ అంటే.
ఇప్పుడు పైన చెప్పినట్లుగానే తమిళాడు తిరుచ్చిలో బిర్యానీ వ్యాపారులు (అక్టోర్ 11న) ఇవాళ బిర్యానీ డే సందర్భంగా భోజన ప్రియులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. తిరుచ్చి లో కేఎంఎస్ హకీం కల్యాణ బిర్యానీ హోటల్ యజమాని కేవలం పదిపైసలికే బిర్యానీ అంటూ ప్రచారం చేశారు. ప్రచారంతో పదిపైసలు బిర్యానీ కోసం జనం భారీగా ఎగబడ్డారు. కంట్రోల్ చేయలేక లాఠీ ఛార్జ్ కూడా చేశారు. ఓ వైపు కిలోమీటర్ల మేర కరోనా నిబంధనలు పట్టించుకోకుండా నిలబడ్డారు. దీనిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ హోటల్ యజమానికి ఫైన్ విధించారు