
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ అంటేనే బికినీలు, మోనోకినీలు, స్విమ్‌సూట్లలో గ్లామరస్ లుక్స్ గుర్తుకొస్తాయి. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే హాట్ ఫోటోషూట్‌లకు భారీ ఫాలోయింగ్ ఉంది. అయితే, ఈసారి జాన్వీ తన అభిమానులను ఆశ్చర్యపరుస్తూ సంప్రదాయ చీరకట్టులో కనిపించి అందరి మనసు దోచుకుంది.
లేటెస్ట్ గా ఆమె ధరించిన ప్రైనీ గోల్డ్ అండ్ పింక్ డిజైనర్ శారీ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చీరకు మ్యాచింగ్‌గా ఆమె ఎంచుకున్న డిజైనర్ బ్లౌజ్ చాలా ప్రత్యేకంగా ఉంది. వెనక భాగంలో ముత్యాలతో అలంకరించి, బ్యాక్‌లెస్ లుక్‌లో రూపొందించిన తీరు ఆమె అందాన్ని మరింత పెంచింది. ఈ లుక్‌లో జాన్వీ ఒక కుందనపు బొమ్మలా మెరిసిపోతోంది అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
ఈ సంప్రదాయ దుస్తుల్లో జాన్వీ ఆభరణాల ఎంపిక కూడా చాలా ప్రత్యేకంగా ఉంది. మెడలో ఒక హారం, నడుముకు వడ్డాణం, చెవులకు లోలాకులు.. ఇలా ప్రతిదీ ఆమె అందాన్ని మరింత ఎలివేట్ చేశాయి. జాన్వీ ఎంపిక చేసుకున్న చీర, బ్లౌజ్ డిజైన్, ఆభరణాలు.. అన్నీ కలిసి సంప్రదాయం, ఆధునికతను కలగలిపి ఒక కొత్త ఫ్యాషన్ ట్రెండ్‌ను సృష్టించాయి. చీరకట్టులో కూడా గ్లామర్‌ను ఎలా చూపించవచ్చో ఈ ఫోటోషూట్ ద్వారా ఆమె నిరూపించింది.
జాన్వీ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం టాలీవుడ్‌లో రామ్ చరణ్ సరసన 'పెద్ది' చిత్రంలో నటిస్తోంది. ఇది తెలుగులో ఆమెకు రెండో సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. దీంతో పాటు బాలీవుడ్‌లో 'పరమసుందరి', 'సన్నీ సంస్కారీకి తులసి కుమారి' అనే రెండు సినిమాల్లో నటిస్తోంది. తమిళంలో ఆమె ఎంట్రీపై వార్తలు వస్తున్నా, ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. సినిమాలతో పాటు ఫ్యాషన్ ప్రపంచంలోనూ తనదైన ముద్ర వేసుకుంటున్న జాన్వీ, తన స్టైల్ తో యూత్ ను తెగ ఆకట్టుకుంటుంది.