
లక్నో: ఉత్తరప్రదేశ్లో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు చిన్నారులు, నలుగురు టీనేజర్లతో సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం యూపీలో టెన్త్ బోర్డ్ ఎగ్జామ్కు 10 మంది స్టూడెంట్లతో షాజహాన్పూర్ నుంచి జైతీపూర్ బయల్దేరిన కారు ప్రమాదానికి గురైంది. దీంతో స్పాట్లోనే నలుగురు పిల్లలు చనిపోయారు. కారు కంట్రోల్ తప్పి చెట్టును ఢీకొట్టి, ఆపై కాలువలో పడిందని పోలీసులు తెలిపారు. గాయపడిన ఆరుగురు స్టూడెంట్లను ఆస్పత్రికి తరలించామన్నారు. వారి కండిషన్ నిలకడగా ఉందన్నారు.
పెండ్లికి పోయి వస్తుండగా ఘోరం..
బలియా ఏరియాలో జరిగిన మరో యాక్సిడెంట్లో ఇద్దరు చిన్నారులతో సహా ఆరుగురు మృతి చెందారు. రెండు కార్లు, పికప్ ట్రక్కు ఢీకొనడంతో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. పెండ్లికి వెళ్లి వస్తుండగా మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.