కరోనా భయం.. పార్లమెంట్‌లో అల్ట్రావయోలెట్ డిసిన్‌ఫెక్షన్ డివైజ్ ఏర్పాటు

కరోనా భయం.. పార్లమెంట్‌లో అల్ట్రావయోలెట్ డిసిన్‌ఫెక్షన్ డివైజ్ ఏర్పాటు

వర్షాకాల సమావేశాలకు అరేంజ్‌మెంట్స్ ముమ్మరం
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకం కలుగుతోంది. వర్షాకాల సమావేశాల నిర్వహణపై కూడా దీని ప్రభావం ఉండనుంది. ఈ నేపథ్యంలో పలు జాగ్రత్త చర్యల మధ్య వర్షాకాల సమావేశాలకు పార్లమెంట్ సిద్ధమవుతోంది. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ తర్వాత నిర్వహిస్తున్న తొలి సమావేశాలు ఇవే కానున్నాయి. సమావేశాల నిర్వహణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గత నెలలో రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చర్చించారు.

ఇరు హౌస్‌ల స్పీకర్‌‌ల ఈ మీటింగ్‌లో రెండు హౌజ్‌ల్లోని చాంబర్స్, గ్యాలరీలను సోషల్ డిస్టెన్సింగ్ రూల్స్ పాటిస్తూ సిట్టింగ్ కోసం వాడాలని నిర్ణయించారని తెలుస్తోంది. ఈ నెల మూడో వారానికల్లా సెషన్స్‌కు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని వెంకయ్య ఆదేశించారని సమాచారం. హౌస్‌లోని చాంబర్స్‌లో నాలుగు పెద్ద స్క్రీన్‌లను, అలాగే ఆరు చిన్న స్క్రీన్స్‌ను గ్యాలరీల్లో ఏర్పాటు చేయనున్నట్లు రాజ్య సభ సెక్రటేరియట్ చెప్పారు. జెర్మ్స్‌, వైరస్‌లను చంపడానికి ఎయిర్‌‌ కండీషన్స్‌ యూనిట్స్‌లో అల్ట్రావయోలెట్ జెర్మిడికల్ ఇర్రేడియేషన్ సిస్టమ్‌ను బిగించనున్నారని తెలిసింది.