అసెంబ్లీకి 10 మంది ఆడబిడ్డలు..కాంగ్రెస్ నుంచి ఆరుగురు,బీఆర్‌‌ఎస్‌ నుంచి నలుగురు

అసెంబ్లీకి 10 మంది ఆడబిడ్డలు..కాంగ్రెస్ నుంచి ఆరుగురు,బీఆర్‌‌ఎస్‌ నుంచి నలుగురు
  •  గత ఎన్నికల్లో ఆరుగురు,ఈసారి పది మంది
  • తొలి ప్రయత్నంలో నలుగురు గెలుపు.. ఓడిన ముగ్గురు సిట్టింగులు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర అసెంబ్లీలో మహిళల ప్రాతినిథ్యం పెరిగింది. గత ఎన్నికల్లో ఆరుగురు మహిళలే విజయం సాధించగా, ఈసారి పది మంది గెలుపొందారు. వీరిలో నలుగురు మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వగా.. మరో ఆరుగురికి ఇదివరకు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. మొత్తంగా కాంగ్రెస్ నుంచి ఆరుగురు, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ నుంచి నలుగురు విజయం సాధించారు. ఇందులో ముగ్గురికి మంత్రులుగా చేసిన అనుభవం ఉంది. ములుగు నుంచి సీతక్క మరోసారి విజయం సాధించారు. తన సమీప బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతిని 33,700 ఓట్ల తేడాతో సీతక్క ఓడించారు. వైఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కొండా సురేఖ వరంగల్ ఈస్ట్ నుంచి 15,652 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బీజేపీ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎర్రబెల్లి ప్రదీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు రెండో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సునీతా లక్ష్మారెడ్డి, ఈసారి బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ అభ్యర్థిగా నర్సాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోటీ చేశారు. కాంగ్రెస్ క్యాండిడేట్ ఆవుల రాజిరెడ్డిపై 8,855 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మహేశ్వరం సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరోసారి విన్ అయ్యారు. 26,187 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సబిత ఓడించారు. 

ఆసిఫాబాద్ నుంచి కోవ లక్ష్మి విజయం

ఆసిఫాబాద్ ఎమ్మెల్యే, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ లీడర్ కోవ లక్ష్మి 22,798 ఓట్ల మెజార్టీతో మరోసారి గెలుపొందారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భర్త, కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండో స్థానంలో నిలిచారు. రేఖా నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కేసీఆర్ టికెట్ ఇవ్వకపోవడంతో, తన ఆర్టీవో ఉద్యోగానికి రాజీనామా చేసి శ్యామ్ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరారు. ఖానాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెడ్మ బొజ్జుకు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అసిఫాబాద్ టికెట్ ఇచ్చింది. 2018 ఎలక్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కోదాడలో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ లీడర్ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.పద్మావతి రెడ్డి, తర్వాత జరిగిన హుజుర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉప ఎన్నికల్లోనూ ఓటమి పాలయ్యారు. ఇప్పుడు కోదాడ నుంచి పోటీ చేసిన పద్మావతి, సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై 57,006 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

సత్తుపల్లి నుంచి రాగమయి

సత్తుపల్లి నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన సండ్ర వెంకట వీరయ్యను, తన తొలి ప్రయత్నంలో మట్టా రాగమయి చిత్తుగా ఓడించారు. సండ్ర చేతిలో మూడుసార్లు ఓడిపోయిన మట్టా దయానంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భార్యనే రాగమయి. దయానంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్సీ కాదని ప్రతిపక్షాలు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, ఆ కేసు ఇంకా కోర్టులో పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండడంతో ఆయన భార్య రాగమయికి టికెట్ ఇప్పించుకున్నారు. డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నియోజకవర్గంలో రాగమయి సుపరిచితురాలు కావడం ఆమెకు కలిసొచ్చింది. 19,440 ఓట్ల భారీ మెజార్టీతో ఆమె గెలుపొందింది. 

కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత

కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న చనిపోవడంతో, ఈ ఎన్నికల్లో ఆయన బిడ్డ, మాజీ కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాస్య నందితకు బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ టికెట్ ఇచ్చింది. బీజేపీ అభ్యర్థి శ్రీగణేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై 17,169 ఓట్ల తేడాతో ఆమె గెలుపొందారు. ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన దివంగత గద్దర్ కూతురు వెన్నెల 20,825 మాత్రమే సాధించి మూడో స్థానంలో నిలిచారు.

ఓడిన సిట్టింగులు

మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఇల్లెందు సిట్టింగ్ ఎమ్మెల్యే బానోతు హరిప్రియా నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆలేరు సిట్టింగ్ ఎమ్మెల్యే గొంగిడి సునీతా ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. గద్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్ అభ్యర్థి సరిత కురుమ 7,036 ఓట్లతో, స్టేషన్ ఘన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్ అభ్యర్థి సింగాపురం ఇందిరా 7,779 ఓట్లతో, ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి విజయా రెడ్డి 22వేల ఓట్లతో, చార్మినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీజేపీ అభ్యర్థి మేఘా రాణి అగర్వాల్ 22,853 ఓట్లతో, ఇల్లందు బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ అభ్యర్థి బానోతు హరిప్రియా నాయక్ 57,309 ఓట్ల తేడాతో ఓడిపోయి, రెండో స్థానాలతో సరిపెట్టుకున్నారు.

తొలి ప్రయత్నంలోనే యశస్విని విజయం

ఎలాంటి రాజకీయ అనుభవం లేని నలుగురు మహిళలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలుపొందారు. పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి మామిడాల యశస్విని, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావును 47,634 ఓట్ల భారీ మెజార్టీతో ఓడించి రికార్డు సృష్టించారు. యశస్విని అత్త, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ హనుమండ్ల ఝాన్సీరెడ్డి పాలకుర్తి నుంచి పోటీ చేయాలని భావించారు. ఇందుకోసం ఆమె గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నాక, ఆమె పౌరసత్వంపై వివాదం నెలకొంది. దీంతో తనకు బదులు, కోడలు యశస్వినికి కాంగ్రెస్ టికెట్ ఇప్పించుకున్నారు. రాజకీయ అనుభవం లేని యశస్విని, మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఎర్రబెల్లిని చిత్తుగా ఓడించారు.

నారాయణపేట నుంచి పర్నికా రెడ్డి

మాజీ ఎమ్మెల్యె చిట్టెం నర్సిరెడ్డి మనవరాలు, నారాయణపేట కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోడలు చిట్టెం పర్నికారెడ్డి నారాయణపేట నుంచి గెలుపొందారు. రాజకీయ అనుభవంలేని పర్నికా రెడ్డి.. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ అభ్యర్థి రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డిని 7,951 ఓట్ల మెజార్టీతో ఓడించారు.