జవహర్నగర్లో 10 ఏళ్ల చిన్నారి అదృశ్యం

జవహర్నగర్లో 10 ఏళ్ల చిన్నారి అదృశ్యం

మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో 10 ఏళ్ల చిన్నారి మిస్సింగ్ అవడం కలకలం రేపింది. 4వ తరగతి చదువుతున్న ఇందు అనే చిన్నారి మిస్ అయింది. ఉదయం పాప తండ్రి దమ్మైగూడలోని ప్రభుత్వ పాఠశాల వద్ద వదిలిపెట్టి వెళ్లగా.. ఆ తర్వాత నుంచి పాప కన్పించలేదని సమాచారం. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు పాప కోసం గాలిస్తున్నారు. 

పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారా లేక స్కూల్ నుంచి ఎటైనా వెళ్లిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. స్కూల్ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. పిల్లలకు రక్షణ కరువైందని స్కూల్ సమీపంలో సీసీ కెమెరాలు కూడా లేవని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు