దౌర్జన్యం : గ్రామంనుంచి 100 కుటుంబాల బహిష్కరణ

దౌర్జన్యం : గ్రామంనుంచి 100 కుటుంబాల బహిష్కరణ

నిజామాబాద్ : ఆర్మూర్ మండలం మగ్గిడిలో గ్రామాభివృద్ధి కమిటీ దౌర్జన్యంగా వ్యవహరించిందన్న ఆరోపణలు జిల్లాలో సంచలనం రేపుతున్నాయి. భూకబ్జాపై ప్రశ్నించినందుకు… 100 వడ్డెర కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేస్తూ అభివృద్ధి కమిటీ తీర్మానం చేసింది. వేటు పడిన వడ్డెర కుటుంబాలతో ఎవరూ మాట్లాడొద్దంటూ హుకుం జారీచేశారు కమిటీలోని నాయకులు.

దీంతో.. బాధితులైన వడ్డెర కుటుంబాలు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. తమకు అన్యాయం జరిగిందంటూ పోలీసులకు కంప్లయింట్ చేశారు. కబ్జాపై ప్రశ్నిస్తే గ్రామంనుంచి వెలేశారంటూ పోలీసులకు చెప్పారు. గ్రామాభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.