మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్ట్.. జింబాబ్వేను క్లీన్‌‌‌‌స్వీప్‌‌‌‌ చేసిన సౌతాఫ్రికా

మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్ట్.. జింబాబ్వేను క్లీన్‌‌‌‌స్వీప్‌‌‌‌ చేసిన సౌతాఫ్రికా

బులవాయో: ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షోతో చెలరేగిన సౌతాఫ్రికా.. జింబాబ్వేతో మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్ట్‌‌‌‌లో ఇన్నింగ్స్‌‌‌‌ 236 రన్స్‌‌‌‌ తేడాతో గెలిచింది. దీంతో రెండు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌ను 2–0తో క్లీన్‌‌‌‌స్వీప్‌‌‌‌ చేసింది. 51/1 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో మంగళవారం (జులై 08) ఆట కొనసాగించిన జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 77.3 ఓవర్లలో 220 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. 

నిక్‌‌‌‌ వెల్చ్‌‌‌‌ (55), కెప్టెన్‌‌‌‌ క్రెయిగ్‌‌‌‌ ఎర్విన్‌‌‌‌ (49), కైటానో (40), తనక చివాంగ (22) రాణించినా మిగతా వారు నిరాశపర్చారు. కార్బిన్‌‌‌‌ బోష్‌‌‌‌ 4, సేనురన్ ముత్తుసామి 3, కొడి యూసుఫ్‌‌‌‌ 2 వికెట్లు తీశారు. వియాన్‌‌‌‌ ముల్డర్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’, ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద సిరీస్‌‌‌‌’ అవార్డులు లభించాయి. గత 20 ఏండ్లలో జింబాబ్వేకు ఇది అతి పెద్ద ఓటమి కావడం గమనార్హం. ఇక జింబాబ్వే పేసర్‌‌‌‌ కుందాయ్‌‌‌‌ మాటిగిము మ్యాచ్‌‌‌‌ ఫీజులో 15 శాతం జరిమానాతో పాటు ఓ డీమెరిట్‌‌‌‌ పాయింట్‌‌‌‌ విధించారు. 

తొలి రోజు ఆటలో బాల్‌‌‌‌ను ప్రమాదకరంగా విసిరినందుకు రిఫరీ ఈ చర్యలు తీసుకున్నాడు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌‌‌‌ 72వ ఓవర్‌‌‌‌లో మాటిగిము తన ఫాలో త్రూలో బంతిని ఆపి బ్యాటర్‌‌‌‌ లువాన్‌‌‌‌ డి ప్రిటోరియస్‌‌‌‌ వైపు బలంగా విసిరాడు. అది బ్యాటర్‌‌‌‌ మణికట్టుకు తాకింది. ఐసీసీ కోడ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ కండక్ట్‌‌‌‌లోని ఆర్టికల్‌‌‌‌ 2.9ని కుందాయ్‌‌‌‌ ఉల్లంఘించాడని రిఫరీ వెల్లడించాడు.