నేషనల్ ఫెన్సింగ్‌‌లో తెలంగాణకు 6 మెడల్స్‌‌

నేషనల్ ఫెన్సింగ్‌‌లో  తెలంగాణకు 6 మెడల్స్‌‌

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ యువ ఫెన్సర్లు  నేషనల్ మినీ, చైల్డ్  ఫెన్సింగ్ చాంపియన్‌‌షిప్‌‌లో ఆరు మెడల్స్‌‌తో సత్తా చాటారు.  గర్ల్స్‌‌ యిపీ విభాగంలో - తనిష్క గుండు, బాయ్స్ ఫాయిల్ విభాగంలో - గుమ్మడి రేయాన్ష్ గోల్డ్ మెడల్స్ సొంతం చేసుకున్నారు.  

సారా (మినీ  ఫాయిల్),  అయాన్ష్ (చైల్డ్ యిపీ) రజతాలు నెగ్గగా,   -ఆరూషి (మినీ  యిపీ),  ఈమాన్ నౌరా (ఫాయిల్) కాంస్యాలు గెలిచారు.