
- ఎగువ నుంచి వస్తున్న వరదను విడిచిపెట్టడం దుర్మార్గం
- రాజకీయ కక్ష సాధింపు మానేసి రైతాంగంపై దృష్టి పెట్టాలని సూచన
హైదరాబాద్, వెలుగు: కల్వకుర్తి మోటార్లు ఆన్ చేసి నీళ్లు విడుదల చేయడం బీఆర్ఎస్, కేసీఆర్ విజయమేనని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తాము ప్రశ్నిస్తే తప్ప రైతుల నీటి సమస్యలు గుర్తుకురావడం లేదని ఆరోపించారు. ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరదను ఒడిసిపట్టాల్సింది పోయి, విడిచిపెట్టడం దుర్మార్గమని పేర్కొంటూ ట్వీట్ చేశారు. కల్వకుర్తి వలే, కాళేశ్వరం మోటార్లు కూడా ఆన్ చేసి పొలాలకు నీళ్లు మళ్లించాలని హరీశ్ పేర్కొన్నారు.