అల్లాపూర్ టోల్ గేట్ వద్ద 100 కిలోల ఎండు గంజాయి పట్టివేత

అల్లాపూర్ టోల్ గేట్ వద్ద 100 కిలోల ఎండు గంజాయి పట్టివేత
  • నిందితులను వెంబడించి పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

తూప్రాన్, వెలుగు: తూప్రాన్ మున్సిపల్ పరిధి అల్లాపూర్ టోల్ గేట్ వద్ద బుధవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు 100 కిలోల ఎండు గంజాయిని పట్టుకు న్నారు. టాస్క్ ఫోర్స్ సీఐ ఆదిరెడ్డి ఆదేశాల మేరకు కా మారెడ్డి జిల్లాలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఓ కారులో గంజాయి తరలిస్తున్నారన్న అనుమానంతో పోలీసులు వెంబడించారు.

 కారు డ్రైవర్ అతివేగంగా భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద గేటును ఢీకొట్టి వెళ్లిపో యాడు. అల్లాపూర్టోల్ గేట్ వద్దకు రాగానే టాస్క్ ఫోర్సొపోలీసులు తమ వాహనంతో వెనక నుంచి ఆ కారును ఢీకొట్టడంతో పల్టీలు కొట్టింది. కారులోఉన్న గంజాయిని స్వాధీనం చేసుకొని, నిందితులు చాంద్ పాషాతోపాటు మరో ఇద్దరు యువకులు. ఇద్దరు మహిళలు. ఇద్దరు చిన్నారులను అదుపులోకి తీసుకున్నారు..