హైదరాబాద్, వెలుగు : టాటా మోటార్స్ బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ)కు ఎలక్ట్రిక్ స్టార్బస్లను డెలివరీ చేసింది. టీఎంఎల్ స్మార్ట్ సిటీ మొబిలిటీ సొల్యూషన్స్ లిమిటెడ్, టాటా మోటార్స్ అనుబంధ సంస్థ బీఎంటీసీ మధ్య ఒప్పందం ప్రకారం 12 ఏళ్లలో 921 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయాలి. వీటి నిర్వహణను కూడా టాటా మోటార్స్చూస్తుంది. ఈ జీరో-ఎమిషన్ ఎలక్ట్రిక్ బస్సులు బెంగుళూరు నగరం అంతటా సేవలను అందిస్తాయి. టాటా మోటార్స్ఇప్పటికే పలు నగరాలకు 1,500 ఎలక్ట్రిక్ బస్సులను అందజేసింది.
