WhatsApp:100 ఫోటోలు,వీడియోలు ఒకేసారి పంపొచ్చు

WhatsApp:100 ఫోటోలు,వీడియోలు ఒకేసారి పంపొచ్చు

మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఓ కొత్త ఫీచర్ ను ప్రకటించింది. ఆండ్రాయిడ్ వినియోగదారులు ఒకేసారి 100 ఫొటోలు, వీడియోలను పంపేందుకు మెటా అనుమతించనుంది. ప్రస్తుతం ఒకేసారి 30 ఫొటోలు లేదా వీడియోలు మాత్రమే అవకాశం ఉండగా.. ప్రస్తుతం ఆ పరిమితిని పెంచినట్టు వెల్లడించింది. అంటే ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఒకేసారి 100 ఫొటోలు లేదా వీడియోను వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చన్నమాట. ప్రస్తుతం ఈ ఫీచర్ 2.22.24.73 వెర్షన్ లో మాత్రమే అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్.. రానున్న రోజుల్లో యూజర్లందరికీ అనువర్తింపజేయనుంది. గత కొన్ని రోజుల క్రితమే వాట్సాప్ లో ఫైల్ పరిమితిని 100ఎంబీ నుంచి 2జీబీకి పెంచుతున్నట్టు ప్రకటించగా...ఈ ఫీచర్ ఇంకా ఐవోఎస్ యూజర్లకు అందుబాటులోకి రాలేదు.

వాట్సాప్ లో వీడియో కాల్ మాట్లాడుతున్నపుడు వేరే యాప్స్ వాడాల్సి వచ్చిందా.. అయితే ఆ టైంలో మనం వీడియో యాక్సెస్ ను కోల్పోవడం చూస్తూనే ఉంటాం. అలా ఇబ్బంది పడేవారికి మెటా ఓ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. అదే పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్. దీన్నే  PiP మోడ్‌ అని కూడా అంటారు. వీడియో కాల్ సమయంలో మల్టీ టాస్కింగ్ ఫీచర్లను పరిచయం చేయడంలో భాగంగా వాట్సాప్ ఈ అప్ డేట్ ను తీసుకొచ్చింది. దీని వల్ల మనం వీడియో కాల్ మాట్లాడుతున్నపుడు ఆ ఏదైనా అవసరముండి వేరే యాప్స్ ను ఓపెన్ చేసినపుడు వీడియో మరొక విండోలో కనిపిస్తుంది. దీని వల్ల వీడియో కాల్స్ లో సంభాషించేందుకు ఎలాంటి అంతరాయం ఉండదు. అంటే వేరే యాప్స్ ను యూజ్ చేస్తూ కూడా మనం వీడియో కాల్స్ ను కొనసాగించవచ్చన్నమాట. కొత్తగా తీసుకొచ్చిన ఈ ఫీచర్లు ప్రస్తుతం కొంతమంది యూజర్లకు మాత్రమే అందుబాటులోకి రాగా.. వీటి కోసం ప్లే స్టోర్ కు వెళ్లి వాట్సాప్ మెసేంజర్ యాప్ ను అప్ డేట్ చేయాలని మెటా సూచించింది.