అసోంలో దారుణం.. ఒకేసారి 100 రాబందులు మృతి

అసోంలో దారుణం.. ఒకేసారి 100 రాబందులు మృతి

గువ‌హ‌టి : అసోంలో దారుణం జరిగింది. ఒకేసారి 100 రాబందులు మృతి చెందగా.. మరికొన్ని కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాయి. అసోం కామరూప్ జిల్లాలోని చాయగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిలాన్పూర్లో ఈ ఘటన జరిగినట్లు అటవీ శాఖ అధికారులు చెప్పారు. తీవ్ర అనారోగ్యం పాలైన రాబందులకు ట్రీట్మెంట్ ఇచ్చి వాటి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో రాబంధులు చనిపోవడం చర్చనీయాంశంగా మారింది. 

రాబంధులు చనిపోయిన ప్రాంతంలో మేక కళేబరాలు ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. వాటిని తినడం వల్లే అవి మృతి చెంది ఉంటాయని ప్రాథమికంగా నిర్థారించారు. విషపూరితమైన మేక మాంసం తిని రాబంధులు చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరణానికి అసలు కారణాలు తెలుస్తాయని అసోం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఎవరో ఉద్దేశపూర్వకంగానే మేక మాంసంలో విషం కలిపారని, వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.

For more news..

హోలీ వేడుకల్లో మందుపోసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్

సీఎంగా శివరాజ్ సింగ్ చౌహాన్ అరుదైన రికార్డు