
కాగజ్ నగర్, వెలుగు : కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో అక్రమంగా పట్టుబడిన మద్యాన్ని పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. చింతలమానేపల్లి పోలీసుస్టేషన్ ఆవరణలో వరుసగా పేర్చి రోడ్ రోలర్ తో తొక్కించారు. గత ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండగా జిల్లాలోని పలుప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 21 లక్షల విలువైన మద్యాన్ని ఆకస్మిక తనిఖీలు చేసి పోలీసులు, ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నా రు.
బుధవారం ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఎక్సైజ్ సూపరిండెంట్ జ్యోతి కిరణ్, కాగజ్ నగర్ డీఎస్పీ రామానుజం సమక్షంలో ధ్వంసం చేశారు. వీటిలో10,155 బీరు బాటిళ్లు,376 విస్కీ బాటిళ్లు ఉన్నాయి. ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఎక్సైజ్ సూపరిండెంట్ జ్యోతి కిరణ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లో రూల్స్ అతిక్రమించి నిల్వ చేసిన మద్యాన్ని పట్టుకున్నట్టు చెప్పారు.