H1B వీసా ఫీజు పెంపుతో.. భారతీయ టెక్కీలలో ఆందోళన.. శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్టులో గందరగోళం

H1B వీసా ఫీజు పెంపుతో.. భారతీయ టెక్కీలలో ఆందోళన.. శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్టులో గందరగోళం

H1B వీసా ఫీజు పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమెరికాలోని భారతీయుల్లో ఆందోళన మొదలైంది. విదేశాల్లో ఉన్న ప్రముఖ కంపెనీలకు చెందిన టెక్కీలు అమెరికా బాటపట్టారు.  కొందరు విదేశీ ప్రయానం చేయాలా వద్దా అని డైలమాలో ఉన్నారు. ఆదివారం (సెప్టెంబర్21) అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయం ప్రయాణికులతో కిక్కిరిపోయింది. కొంతమంది రీఎంట్రీ సమస్యలను దృష్టిలో ఉంచుకొని విమానం ఎక్కిన వారు దిగిపోయారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Masud Rana (@mashraana)

ఆదివారంశాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో చాలామంది భారతీయ ప్రయాణికులు ఎమిరేట్స్ విమానం టేకాఫ్ కావడానికి కొన్ని నిమిషాల ముందు దిగిపోయారేు. అక్కడికి వెళితే అమెరికాకు తిరిగి రాలేరేమోనని భయపడుతున్నట్లు తెలుస్తోంది. అనుకోకుండా ప్రయాణికులు వెనుదిరగడంతో  విమానం మూడు గంటలకు పైగా ఆలస్యమైంది. 

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ X ,Instagram లలో వైరల్ అవుతున్న వీడియోలో  విమానం క్యాబిన్ నిండా భారతీయ పౌరులతో నిండి ఉన్నట్లు కనిపిస్తుంది. H-1B వీసా ఫీజు పెంపు వార్త వైరల్ అయిన తర్వాత ప్రయాణీకులు భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. 

మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి అమెరికా కంపెనీలు ఇప్పటికే తమ ఉద్యోగులను తిరిగి అమెరికాకు రావాలని మెయిల్స్ పంపిన విషయం తెలిసిందే. దీంతో శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్టులో గందరగోళం నెలకొంది. 

టెక్ సంస్థలు జాగ్రత్తలతో.. 

ట్రంప్ H1B వీసా ఫీజు పెంపు నిర్ణయంతో అమెరికాలోని భారతీయ డయాస్పోరాలో ఆందోళనను రేకెత్తించింది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ ,జెపి మోర్గాన్ వంటి ప్రధాన యుఎస్ సంస్థలు, హెచ్ -1బి వీసాలపై ఉన్న ఉద్యోగులు సెప్టెంబర్ 21 లోపు అమెరికాకు తిరిగి రావాలని లేకుండా వీసా సమస్యలు వచ్చే అవకాశం ఉందని, ఉద్యోగులు అంతర్జాతీయ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని ఆయా సంస్థలు కోరుతూ మెసేజ్ లు పంపించాయి. 

ట్రంప్ నిర్ణయంతో ఎంత ఫీజు పెరుగుతుందంటే.. 

ప్రస్తుతం H-1B కోసం దరఖాస్తుకు అయ్యే ఖర్చు యజమాని ,ఇతర అంశాలను బట్టి 2వేల నుంచి 5 వేల యూఎస్ డాలర్లుగా ఉంది. ట్రంప్ కొత్త ఎగ్జి్క్యూటివ్ ఆర్డర్ తో H1B వీసా ఫీజు లక్ష డాలర్లకుచేరింది. ఇది ఇండియన్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది.. అమెరికా జారీ చేసే H1B వీసాలలో 75 శాతం భారతీయులే పొందుతున్నారు. దీంతో భారతీయ టెక్కీలు, కంపెనీలకు నష్టం వాటిల్లుతుందని టెక్ నిపుణులు అంటున్నారు.