ఏపీలో ఇవాళ ఒక్కరోజే 104 మంది మృతి

ఏపీలో ఇవాళ ఒక్కరోజే 104 మంది మృతి
  • ఒక్క చిత్తూరు జిల్లాలోనే 15 మంది మృతి
  • ఇవాళ 18 వేల 767 కొత్త కేసులు నమోదు

అమరావతి: ఏపీలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. గత కొద్ది రోజులుగా ప్రతిరోజు వందకుపైగా మరణాలు నమోదవుతున్నాయి. గడచిన 24గంటల్లో 91 వేల 629 మందకి పరీక్షలు చేయగా 18 వేల 767  మందికి కరోనా సోకినట్లు తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో గడచిన 24 గంటల్లో 104 మంది కరోనా కాటుకు బలికాగా.. ఇందులో ఒక్క చిత్తూరు జిల్లాలోనే 15 మంది ఉండడం గమనార్హం. తమిళనాడు, కర్నాటకలను ఆనుకుని ఉన్న చిత్తూరు జిల్లాలో కాకతాళీయమో యాదృచ్చికమో గాని వరుసగా మూడు రోజులుగా 15 మంది చొప్పున మరణిస్తున్నారు. మొన్న, నిన్నటి మాదిరే ఇవాళ కూడా ఇవాళ కూడా 15 మరణాలు నమోదు అయ్యాయి. 

కేసుల విషయానికి వస్తే ఉధృతి ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టినట్లు అనిపిస్తోంది. పాజిటివ్ రేటు 25.5శాతం నుండి 20.40 శాతానికి తగ్గింది. ఇవాళపాజిటివ్ రేట్  20.48శాతం నమోదు అయింది. 
కరోనా మరణాల ఉధృతి తగ్గకపోవడం ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 15 మంది చనిపోగా పశ్చిమగోదావరి జిల్లా 13 మంది, విజయనగరం జిల్లాలో 11 మంది, విశాఖపట్ణంలో 9 మంది, అనంతపురం, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో 8 మంది చొప్పున, శ్రీకాకుళం జిల్లాలో ఏడుగురు చొప్పున, నెల్లూరులో ఆరుగురు, కడపలో ముగ్గురు చొప్పున చనిపోయారు. 

రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 2 లక్షల 9 వేల 237 కేసులు ఉన్నాయి.ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా మరణాలు 10 వేలు  దాటాయి. ఇవాళ్టి కేసులతో కలిపితో రాష్ట్రంలో మొత్తం మరణాలు 10వేల 126 (0.64శాతం). అలాగే రికవరీ 15.80 లక్షల లో 13.61లక్షల మంది రికవర్ అయ్యారు. రికవరీ శాతం (86.13శాతం) కూడా కొద్దిగా పెరిగింది. పాజిటివ్ కేసులు రెండు లక్షల కు పైగా ఉన్నాయి. ఇంకా పరిరక్షించాల్సిన లక్షమంది మన చుట్టూ ఉన్నారు. ‘‘అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దు.. ఒకవేళ వెళ్లినా తప్పక మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించండి.. జాగ్రత్త గా ఉంటూ కుటుంబాన్ని కాపాడుకోవాలి.. లేదంటే కుటుంబం మొత్తం ఆసుపత్రి పాలవుతుంది.. ’’అని ఏపీ స్టేట్ కోవిద్ నోడల్ అధికారి డాక్టర్ అర్జా శ్రీకాంత్ హెచ్చరించారు. గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా నమోదైన కొత్త పాజిటివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.