సింగిల్ షాట్‌‌, సింగిల్ క్యారెక్టర్‌‌‌‌లో ‘105 మినిట్స్’

సింగిల్ షాట్‌‌, సింగిల్ క్యారెక్టర్‌‌‌‌లో ‘105 మినిట్స్’

పదహారేళ్ల సినీ కెరీర్‌‌‌‌లో సక్సెస్, ఫెయిల్యూర్స్‌‌తో సంబంధం లేకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్‌‌ చేస్తూ సౌత్‌‌లో స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంది హన్సిక. ప్రస్తుతం అరడజనుకుపైగా ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి. వాటిలో హన్సిక లీడ్‌‌ రోల్‌‌లో నటించిన చిత్రం ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’. హన్సిక  సింగిల్ షాట్‌‌లో సింగిల్ క్యారెక్టర్‌‌‌‌లో నటించడం విశేషం. రాజు దుస్సా దర్శకత్వంలో బొమ్మక్ శివ నిర్మిస్తున్నారు. షూటింగ్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ రెడీ అయిన సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘ గంటా నలభై ఐదు నిమిషాల పాటు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది.  హాలీవుడ్‌‌లో సింగిల్ షాట్ టెక్నిక్‌‌లో తెరకెక్కిన బర్డ్ మన్, 1917 చిత్రాల తరహాలో ఈ చిత్రాన్ని రూపొందించాం. రీల్ టైం, రియల్ టైం ఒకేలా ఉండే సీన్స్ ప్రత్యక్షంగా ఉన్నట్లు ఫీల్ కలుగుతుంది.  డైలాగులు కూడా చాలా తక్కువగా, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమా ఉంటుంది. హన్సిక కెరీర్‌‌‌‌లో ఈ మూవీ ఒక బెంచ్ మార్క్‌‌గా నిలిచిపోతుంది’ అన్నారు.